BRS MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
ఎమ్మెల్యేల కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, గంగల కమలాకర్, ఎమ్మెల్యేలు మద్దతు రాగా ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్లు అందజేశారు.

ts mlc
BRS MLC Candidates Nominations : ఎమ్మెల్యేల కోటాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, గంగల కమలాకర్, ఎమ్మెల్యేలు మద్దతు రాగా ఎమ్మెల్సీ అభ్యర్థులు అసెంబ్లీ కార్యదర్శికి నామినేషన్లు అందజేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్ కుమార్, సీనియర్ నేత చల్లా వెంకట్రామిరెడ్డి, సీఎం కేసీఆర్ ఓఎస్ డీ దేశపతి శ్రీనివాస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు.
ముహూర్తం ప్రకారం.. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. సీఎం ఓఎస్ డీ దేశపతి శ్రీనివాస్ అమరవీరులపై ఆలపించిన గేయం ఆకట్టుకుంది. సభలో సంపూర్ణ మెజారిటీ ఉండటం, ప్రతిపక్షాలు పోటీకి దూరంగా ఉండటంతో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కానున్నాయి.
YCP MLC Candidates Nominations : ఎమ్మెల్యే కోటా వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు
ఫిబ్రవరి 28న తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి6న నోటిఫికేషన్ వెలువడింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి23న పోలింగ్ జరుగనుండగా అదే రోజు కౌంటింగ్ జరుగనుంది. నామినేషన్ల దాఖలుకు గడువు మార్చి 13గా సీఈసీ నిర్ణయించింది. తెలంగాణలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్, నవీన్ కుమార్ పదవీ కాలం ముగియనుంది. తెలంగాణలో మూడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి.