Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం

రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించుకున్నారు.

Delhi Liquor Policy Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం

BRS MLC Kavitha

Updated On : August 6, 2024 / 11:17 AM IST

Delhi Liquor Policy CBI Case : ఢిల్లీ లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకుంది. సోమవారం రౌస్ అవెన్యూ కోర్టులో కవిత డిఫాల్ట్ బెయిల్ కేసు విచారణ వాయిదా పడింది. కవిత తరపు న్యాయవాదులు విచారణకు హాజరుకాకపోవడంతో జడ్జి కావేరి బవేజా అసహనం వ్యక్తం చేశారు. వాదనలకు రాకపోతే పిటిషన్ ఉపసంహరించుకోవాలని సూచించారు. రేపటికి కేసును వాయిదావేస్తూ, ఆరోజు తుది విచారణ జరుపుతామని కోర్టు తెలిపింది.

Also Read : Bangladesh Crisis : మరికొన్ని రోజులు భారత్ లోనే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా.. షాకిచ్చిన యూకే!

రేపు విచారణ జరగనున్న నేపథ్యంలో కవిత న్యాయవాదులు ఈరోజే కేసును ఉపసంహరించుకున్నారు. సీబీఐ చార్జ్ షీట్ లో తప్పులు ఉన్నాయని, కవిత డిఫాల్ట్ బెయిల్ కు అర్హురాలని జూలై 6న డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. అయితే, చార్జ్ షీట్లో తప్పులేమీ సీబీఐ పేర్కొంది. ఇప్పటికే సీబీఐ చార్జ్ షీట్ ను జూలై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్ షీట్ పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.

ఇదిలాఉంటే.. లిక్కర్ మనీలాండరింగ్  కేసులో కవిత అరెస్ట్ అయ్యి ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉంటున్నారు. మంగళవారం తీహార్ జైల్లో ఉన్న కవితతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావులు ములాఖత్ అయ్యారు.