Flex boards: విజయవాడలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు… హైదరాబాద్‌లో కవిత పోస్టర్లు

‘‘జయహో కేసీఆర్... దేశ రాజకీయాల్లో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం. కక్ష రాజకీయాలకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా’’ అని అందులో పేర్కొన్నారు. మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రేపు సీబీఐ విచారణను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘‘ఫైటర్ కూతురు ఎప్పటికీ భయపడదు’’ అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

Flex boards: విజయవాడలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలు… హైదరాబాద్‌లో కవిత పోస్టర్లు

Flex boards

Updated On : December 10, 2022 / 4:29 PM IST

Flex boards: టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా ఆవిర్భవించిన ఆ పార్టీ ఫ్లెక్సీలు ఆంధ్రప్రదేశ్ లోనూ దర్శనమిస్తున్నాయి. విజయవాడలో బీఆర్ఎస్ కు సంబంధించిన ఫ్లెక్స్ బోర్డులు కనబడ్డాయి. వీటిల్లో బీఆర్ఎస్ పేరుతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఫొటోలు ఉన్నాయి.

‘‘జయహో కేసీఆర్… దేశ రాజకీయాల్లో నూతన శకం.. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం. కక్ష రాజకీయాలకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా’’ అని అందులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీతో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ ప్రవేశిస్తున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయనుంది.

మరోవైపు కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత రేపు సీబీఐ విచారణను ఎదుర్కోనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆమె నివాసం వద్ద పోస్టర్లు ఏర్పాటు చేశారు. ‘‘ఫైటర్ కూతురు ఎప్పటికీ భయపడదు’’ అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు.

కవిత ఫొటోతో పాటు కేసీఆర్, కేటీఆర్ ఫొటోలు కూడా ఇందులో కనపడుతున్నాయి. కాగా, రేపు తన నివాసం వద్ద కవిత సీబీఐ విచారణను ఎదుర్కోనున్నారు. మొదట ఈ నెల 6వ తేదీన విచారిస్తామని సీబీఐ పేర్కొనగా అందుకు కవిత అభ్యంతరాలు తెలిపారు. దీంతో మరోసారి ఆమెకు సీబీఐ అధికారులు నోటీసులు పంపి, ఈ నెల 11న విచారిస్తామని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు ఉండడం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ కక్ష పూరిత రాజకీయాల్లో భాగంగానే కవితకు సీబీఐ నుంచి నోటీసులు అందాయని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.

తెలంగాణ కేబినెట్ కీలక భేటీ!