Rega Kantha Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో పోస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వరదలపై సోషల్ మీడియా వార్

ఓ పక్క ప్రజలు వరదలతో బాధపడుతుంటే భట్టి విహారయాత్రతో కాంగ్రెస్ నాయకులు విందులు, చిందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. Rega Kantha Rao

Rega Kantha Rao : కాంగ్రెస్ ఎమ్మెల్యే డ్యాన్స్ వీడియో పోస్టు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. వరదలపై సోషల్ మీడియా వార్

Rega Kantha Rao Vs Podem Veeraiah

Updated On : July 30, 2023 / 6:41 PM IST

Rega Kantha Rao Vs Podem Veeraiah : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వరదలపై సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఓ పక్క వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెం వీరయ్య డ్యాన్స్ వీడియో ఒకటి ఫేస్ బుక్ లో పోస్టు చేశారు పినపాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు.

ఓ పక్క ప్రజలు వరదలతో బాధపడుతుంటే భట్టి విహారయాత్రతో కాంగ్రెస్ నాయకులు విందులు, చిందులతో ఎంజాయ్ చేస్తున్నారంటూ కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉందా? అని ఫేస్ బుక్ లో ప్రశ్నించారు రేగా కాంతారావు.

Also Read..Kishan Reddy : రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే ఎస్టీ రిజర్వేషన్లు పెంపు : కిషన్ రెడ్డి

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంతారావు పోస్టుకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరయ్య. ప్రజల వరద కష్టాలు తీర్చలేకనే బీఆర్ఎస్ ఇలా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు అన్న వీరయ్య.. రేగా కాంతారావు విజ్ఞతకే వదిలేస్తున్నా అన్నారు.