Budget session: తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధం
సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 12న గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 13వ తేదిన గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారు. 14వ తేదీన హోలీ సందర్బంగా హాలీడే ఉంటుంది. 15వ తేదీన ధన్యవాద తీర్మానం ఉంటుంది.
ఇక 16వ తేదీన ఆదివారం సెలవు, 17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ, 18న బీసీ కులగణన, రిజర్వేషన్లపై చర్చ జరుపుతారు. 19న తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెడతారు. 20వ తేదీన సెలవు, 21వ తేదీ నుంచి బడ్జెట్ పై చర్చ ఉంటుంది. 27వ తేదీ వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి.
సభ నిర్వహణ ఏర్పాట్లపై ఇప్పటికే స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.
అలాగే, శాసనసభ, మండలి సమావేశాల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కూడా సమీక్ష అధికారుతో సమీక్ష నిర్వహించారు. బడ్జెట్ సెషన్‌లో సరైన సమాచారం అందించడానికి సంబంధిత కార్యదర్శులు హాజరు కావాలని అన్నారు.
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని తెలిసింది. ఇవాళ తెలంగాణ భవన్‌కు చేరుకున్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇప్పటికే ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ముఖ్యనేతలు కూడా సమావేశమై కేసీఆర్‌తో చర్చించారు.