Bullet bandi : పెళ్లి కూతురు డ్యాన్స్.. సోషల్ మీడియా షేక్, ఈమె ఎవరో తెలుసా
వరుడు చిరునవ్వులు చిందిస్తూ...చూస్తుండగా...బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Bullet bandi Song : పెళ్లి…ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని ఘట్టం. ఆ ఆనంద క్షణాలను మరింత మధురంగా మార్చుకుంది ఓ వధువు. నచ్చిన వ్యక్తిని పెళ్లిచేసుకోబోతున్న సంతోషాన్ని..జీవితాంతం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసుకుంది. సిగ్గులమొగ్గవుతూ వరుడి పక్కన ఒదిగిపోవడం కాకుండా…స్వయంగా తనకు కాబోయే భర్తకు స్వాగతం పలికింది. తన గుణగుణాలు తెలియజేస్తూ రోడ్డుపై ఆడిపాడింది.
Read More : Ap Government : కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ లేఖ
భవిష్యత్ గురించి కన్న అందమైన కలలను వివరించింది. వరుడు చిరునవ్వులు చిందిస్తూ…చూస్తుండగా…బంధువులు, స్నేహితులు మధ్య ఆమె చేసిన డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. తెలుగు నెటిజన్లంతా బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తప్పా…డుగ్గు…డుగ్గు..డుగ్గు..డుగ్గు అనే పాడుకుంటున్నారు. బుల్లెట్ బండి అనే ప్రయివేట్ ఆల్బమ్ సాంగ్‌కు వధువు చేసిన ఈ డ్యాన్స్ చూసి నెటిజన్లంతా ఫిదా అయ్యారు. ఈ డ్యాన్స్ వీడియో యూట్యూబ్‌లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. కోట్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది. మొత్తానికి తన డ్యాన్స్‌తో తెలుగు రాష్ట్రాల ప్రజలంతా తన గురించి మాట్లాడుకునేలా చేసింది.
Read More : E KYC : రేషన్ కార్డులు తొలగింపు, ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ఇంతగా పాపులర్ అయిన వధువు,వరుడు ఎవరో తెలుసుకోవాలని ఉందా? మంచిర్యాల జిల్లా జన్నారంలో ఈ నెల 14న సాయిశ్రియ, అశోక్ పెళ్లి జరిగింది. పెళ్లి బరాత్‌లో వధువు సాయి శ్రియ ఇలా డ్యాన్స్ చేసింది. అది కాస్తా వీడియో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు ఫ్రెండ్స్. దీంతో వైరల్ అయ్యింది. తన భర్తను సర్ప్రైజ్ చేసేందుకే డ్యాన్స్ చేశానంది వధువు సాయి శ్రియ. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది.