Nalgonda : జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనాన్ని వెనుకనుంచి సూపర్ లగ్జరి బస్సు ఢీకొట్టింది.

Nalgonda
Nalgonda : నల్గొండ జిల్లా పెద్ద కాపర్తి వద్ద జాతీయరహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్ వాహనాన్ని వెనుకనుంచి సూపర్ లగ్జరి బస్సు ఢీకొట్టింది. కంటైనర్ యూ టర్న్ తీసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన సూపర్ లగ్జరి బస్సు వెనుకనుంచి ఢీకొంది. ఈ సమయంలో కంటైనర్, బస్సు మధ్యలో ఉన్న రెండు కార్లు ధ్వంసం కాగా ఓ మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరికొందరి స్వల్ప గాయాలయ్యాయి.
చదవండి : Chittoor Road Accident : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
జాతీయరహదారిపై ప్రమాదం జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. వాహనాలను చూసుకోకుండా కంటైనర్ డ్రైవర్ యూ టర్న్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
చదవండి : Road Accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి