CM KCR: ఢిల్లీలో బిజీ బిజీ.. కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన సీఎం?
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలో బిజీ బిజీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పెద్దలను కోరేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది.

CM KCR
CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా, ఢిల్లీలో బిజీ బిజీ పర్యటనలో ఉన్న సీఎం కేంద్ర పెద్దలను కోరేందుకు అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లను కలిసేందుకు సీఎంఓ ఇప్పటికే అపాయింట్ మెంట్ కోరగా నేడు ప్రధాని మోడీ, షెకావత్ లను కలిసే అవకాశం ఉంది.
ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ శంకుస్థాపనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. ఒకేసారి కేంద్ర పెద్దలను కలిసిన తర్వాతే రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తుంది. వీలైతే నేడు మోడీ, షెకావత్ లను కలవనున్న కేసీఆర్ ఆ తర్వాత రేపు అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే.
కాగా, నేడు కేసీఆర్ కేంద్ర పెద్దలతో భేటీ నేపథ్యంలో జలవివాదం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో హుజురాబాద్ ఉపఎన్నికలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే కాగా.. సీఎం కేసీఆర్ ఢిల్లీలో బీజేపీ నేతలతో భేటీతో మరోసారి రాష్ట్రంలో రాజకీయ వర్గాలలో చర్చలు మొదలయ్యాయి.