Godavari Flood: శాంతించిన గోదావరి.. భద్రాద్రి వద్ద 64అడుగులకు చేరిన నీటిమట్టం.. ముంపులోనే లోతట్టు ప్రాంతాలు
గోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఆదివారం ఉదయానికి 64అడుగుల వద్దకు చేరింది.

Godavari Flood(1)
Godavari Flood: గోదావరి శాంతించింది.. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధృతి తగ్గడంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుముఖం పట్టింది. శనివారం మధ్యాహ్నం 71 అడుగులకు పైగా ప్రవహించిన గోదావరి.. సాయంత్రం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. ఆదివారం ఉదయానికి 64అడుగుల వద్దకు చేరింది. దీంతో భద్రాచలం ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇంకా ముంపు తప్పలేదని అధికారులు పేర్కొంటున్నారు. మరో 24గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని, ఆ మేరకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
Godavari Flood : గోదావరి ఉగ్రరూపం..జలదిగ్బంధంలో 628 లంక గ్రామాలు
గోదావరికి వరద తగ్గుముఖం పట్టినప్పటికీ వందలాది గ్రామాలు ముంపులోనే ఉన్నాయి. ప్రస్తుతం భద్రాద్రి వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. మరో రెండుమూడు రోజుల పాటు ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. గోదావరి నీటి మట్టం రెండవ ప్రమాద హెచ్చరికకు చేరి, నిలకడగా కొనసాగే వరకు ముంపు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ఇప్పటికే అధికారులు సూచించారు. భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని తొమ్మిది మండలాల్లో 87 గ్రామాల్లోని 7,545 కుటుంబాలకు చెందిన మొత్తం 25, 975 మంది ముంపు ప్రజలు ఇంకా 75 పునరావాస కేంద్రాల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. వరద ఉధృతికి వేలాది ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. రోడ్లు తెగిపోయాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది.
Godavari Floods: భయం గుప్పిట్లో భద్రాద్రి.. 71.30 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం..
భద్రాచలం పట్టణంలో సుభాష్ నగర్ కాలనీ, అయ్యప్ప కాలనీలు ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. అశ్వాపురం మండలంలో గోదావరి నీటి ఉధృతి కొంతమేర తగ్గినా ఇంకా పరివాహక ప్రాంతాలు నీటిలోనే నానుతున్నాయి. దీంతో అధికారులు ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు కొనసాగించారు. అమ్మగారిపల్లి, ఆనందాపురం, చింతిర్యాల, నెల్లిపాక జలదిగ్భదంలోనే ఉన్నాయి. భద్రాచలం – చర్ల రాకపోకలు పునరుద్ధరణ కానున్నాయి. 11 పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. చర్లం మండలంలో కొంతమంది ముందుకొచ్చి బాధితులకు ఆహార పదార్థాలు అందిస్తున్నారు.