కొత్త విద్యా సంవత్సరంపై ఇప్పుడే చెప్పలేము

  • Published By: bheemraj ,Published On : July 23, 2020 / 12:08 AM IST
కొత్త విద్యా సంవత్సరంపై ఇప్పుడే చెప్పలేము

Updated On : July 23, 2020 / 6:48 AM IST

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. కొత్త విద్యా సంవత్సరం కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉందని హైకోర్టుకు తెలిపింది. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంపై తల్లిదండ్రుల నుంచి ఫీడ్ బ్యాక్ సమర్పించాలని డీఇఓలను ఆదేశించినట్లు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. డిజిటల్ విద్యపై ఎన్ సీఈఆర్ టీ మార్గదర్శకాలను అనుసరిస్తామని, ఆన్ లైన్ క్లాసులపై విద్యారంగ నిపుణులతో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు నివేదికను సమర్పించింది.

తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ క్లాసుల పేరిట ప్రైవేటు పాఠశాలలు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయి. దీన్ని అరికట్టాలంటూ పెరెంట్స్ స్కూల్ అసోసియేషన్ నిర్వహకులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గతంలో హైకోర్టు విచారించి దీనిపై ఆన్ లైన్ క్లాసులపై ప్రభుత్వ తీరును అదేవిధంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంది? అసలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలా? వద్దా? అనే దానిపైన కూడా పూర్తి నివేదిక సమర్పించారంటూ కూడ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఈ రోజు ఆదేశాల ప్రకారమే తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నివేదిక సమర్పించింది. ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలా? వద్దా? అనే దానిపై ఇంకా కసరత్తు చేయలేదు. ఇంకా పూర్తి నివేదిక వెల్లడించేందుకు ఆగస్టు 5 తారీఖు తమకు సమయమివ్వాలి. ఎందుకంటే కేంద్రం గైడెన్స్ ల ప్రకారమే విద్యా సంవత్సరం ప్రారంభించాలా? వద్దా? అనే దానిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు ఈ రోజు ఒక నివేదికను పంపించింది.

కరోనా తీవ్రత రోజురోజూకు విపరీతంగా విజృంభిస్తుంది. విద్యా సంవత్సరం ఎప్పుడు ప్రారంభిస్తామో అని ఇంకా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. దీనికి సంబంధించి పూర్తి నిర్ణయం తీసుకున్న తర్వాతనే క్యాబినేట్ డిస్టెన్స్ తీసుకున్న తర్వాతనే నివేదిక ద్వారా పంపించింది. మరోవైపు సీబీఎస్సీ సిలబస్ ఏదైతే ఉందో కేంద్రం సంబంధించిన సిలబస్ ప్రకారమే ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలా? వద్దా? నిర్ణయం ఆగస్టు 6 కు వాయిదా వేశారు.