Car cleaning saline : సెలైన్ తో కారు క్లీనింగ్..ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆ దృశ్యాలను చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ గా మారింది.

Car cleaning saline : సెలైన్ తో కారు క్లీనింగ్..ఆస్పత్రి సిబ్బంది నిర్వాకం

Car Cleaning With Saline In Huzurabad Government Hospital

Updated On : March 25, 2021 / 8:28 AM IST

Car cleaning with saline : అత్యవసర సమయాల్లో రోగి ప్రాణాన్ని కాపాడే సెలైన్ ను ప్రభుత్వ ఆస్పత్రులు దుర్వినియోగం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోగులకు ఎక్కించాల్సిన సెలైన్ ను కారు తుడిచేందుకు వాడటం కలకలం రేపింది. అక్కడే ఉన్న ఉద్యోగులు ఆ దృశ్యాలను చిత్రీకరించగా ఆ వీడియో వైరల్ గా మారింది.

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రాంతీయ ఆస్పత్రికి రంగులు వేస్తున్నారు. అక్కడే డాక్టర్ కారు నిలిపి ఉంచగా దానిపై సున్నం పడింది. దాన్ని తుడిచేందుకు సిబ్బంది ఏకంగా సెలైన్ వాడారు. ఇదేందటని ప్రశ్నించగా సెలైన్ బాటిల్ లో నీరు పోసి తుడుస్తున్నానని బుకాయించే ప్రయత్నం చేశారు.

సెలైన్ బాటిల్ లో నీళ్లు నింపే అవకాశాలు తక్కువని, కావాలనే ఔషధాలను దుర్వినియోగం చేస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్యం అందించకపోగా ప్రతి చిన్న రోగానికి వరంగల్ ఎంజీఎంకు రిఫరీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.