Tank Bund Car Accident : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

అతి వేగంగా వచ్చిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

Tank Bund Car Accident : హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం

Car Accident

Updated On : July 30, 2023 / 10:08 AM IST

Hussain Sagar Divider : హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ పై కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ మార్గ్ సమీపంలో వేగంగా వచ్చిన కారు అదుపు తప్పి హుస్సేన్ సాగర్ డివైడర్ పైకి దూసుకెళ్లింది. కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలతో బయట పడ్డారు. కారును వదిలి వేసి అక్కడి నుంచి పరారయ్యారు.

గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ మార్గ్ లో హుస్సేన్ సాగర్ కు రక్షణ గోడ నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో కారు ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అతి వేగంగా వచ్చిన కారు హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు.

Ahmedabad Hospital : అహ్మదాబాద్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం..100 మంది రోగుల తరలింపు

ప్రమాదం జరిగినప్పుడు కారులోని ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో ఆ ఇద్దరు వ్యక్తులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనంతరం ఇద్దరు కూడా అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కారు ఎవరిది?  కారులో ఎంత మంది ప్రయాణిస్తున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నారు? అన్న కోణంలో విచారణ చేపట్టారు. సీసీ టీవీఫుటేజీని కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. కారును అక్కడి నుంచి తొలగించారు. కారు నెంబర్ ఆధారంగా అది ఎవరి పేరు మీద ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.