లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై కేసు 

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై కేసు 

Function Halls

Updated On : June 18, 2021 / 3:41 PM IST

లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని ఫంక్షన్‌ హాల్‌ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భోగారంలోని అన్నపూర్ణ ఫంక్షన్‌హాల్‌లో గురువారం (జూన్ 11, 2020) వివాహం జరిగింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి ఎక్కువ మంది ఈ ఫంక్షన్‌లో పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫంక్షన్ హాల్‌కు వెళ్లి పరిశీలించారు. పెళ్లికి వచ్చిన చాలా మంది మాస్కులు కూడా ధరించలేదు. దీంతో ఫంక్షన్‌హాల్‌ యజమాని కృష్ణమూర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తెలంగాణలో గురువారం కొత్తగా 209 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా సోకి 9 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా కేసులు 4,320కి చేరాయి. ఇప్పటివరకు మొత్తం 165 మంది మృతి చెందారు. తెలంగాణలో 2,162 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారికి ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. 1,993 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 175 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్- 10, రంగారెడ్డి- 7, మహబూబ్ నగర్-3, కరీంనగర్-3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వరంగల్ అర్బన్, ఆసిఫాబాద్, సిద్ధిపేట జిల్లాలో రెండేసి కేసులు నమోదు అయ్యాయి. ములుగు, కామారెడ్డి, వరంగల్ రూరల్, సిరిసిల్ల జిల్లాలో ఒక్కో కేసు నమోదు అయింది.