Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదు

హత్య కేసు సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు రావడంతో కరాటే కళ్యాణిపై కేసు పెట్టారు పోలీసులు.

Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణిపై కేసు నమోదు

Karate Kalyani

Updated On : December 25, 2021 / 4:50 PM IST

Karate Kalyani: సినీ నటి కరాటే కళ్యాణిపై జగద్గిరిగుట్ట పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ హత్య కేసుకు సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదు రావడంతో ఆమెపై కేసు పెట్టారు పోలీసులు.

సింగరేణి కాలనీలో ఓ మైనర్ బాలికపై జరిగిన హత్య వివరాలను బహిర్గతం చేసేందుకు ఆమె ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

దీనిపై తూటంశెట్టి నితేష్ అనే వ్యక్తి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రైవేట్ కంప్లేంట్ దాఖలు చేయగా.. ఆమెపై కేసు నమోదు చేయాలని రంగా రెడ్డి కోర్టు ఆదేశించింది.