Cat Missing : పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ. 30 వేలు

Cat
Cat Missing : నా పిల్లిని వెతికి తెచ్చిన వారికి రూ. 30 వేలు ఇస్తానని ఓ మహిళ ప్రకటించారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న పిల్లి తప్పిపోవడంతో ఆమె తీవ్ర కలత చెందారు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైట్ చేశారు. కానీ…వారు ఫిర్యాదు తీసుకోకపోవడంతో…ఓ నిర్ణయం తీసుకున్నారు. తాను పెంచుకున్న పిల్లి కనబడడం లేదు..ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తానంటూ..కరపత్రాలు పంచారు. అయినా..పిల్లి ఆచూకీ తెలియకపోవడంతో మీడియాను ఆశ్రయించారు.
Read More : US Delta Variant : అమెరికాలో ‘డెల్టా’ విజృంభణ.. మూడు వారాల్లో రెట్టింపు కేసులు
టోలిచౌకీ ప్రాంతానికి చెందిన జరీనా…8 నెలల నుంచి ఓ పిల్లిని పెంచుకుంటున్నారు. దీనికి జింజర్ అని పేరు కూడా పెట్టుకున్నారు. జూన్ 17వ తేదీన జింజర్ కు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించారు. కొద్దిగా వాపు రావడంతో..తిరిగి జూన్ 23వ తేదీన ఆసపత్రికి తీసుకెళ్లారు. అయితే..అకస్మాత్తుగా పిల్లి అక్కడి నుంచి వెళ్లిపోయింది. పిల్లి కోసం అక్కడా..ఇక్కడా వెతికారు.
Read More : Pawanothsavam: జన సైనికుల పవనోత్సవం షురూ..
కానీ..దాని ఆచూకి తెలియలేదు. దీంతో జూన్ 27న రాయదుర్గం పోలీసులను ఆశ్రయించారు. వారు ఫిర్యాదు తీసుకోలేదు. దీంతో..జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలలో పిల్లి ఫొటోతో కరపత్రాలు కూడా పంచారు. ఇప్పటికీ 20 రోజులైనా..తన పిల్లి దొరకకపోవడంతో…మీడియా ముందుకు వచ్చారు జరీనా. జింజర్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 30 వేల రివార్డు ఇస్తానని, తను ప్రాణంగా పెంచుకుంటున్న జింజర్‌ను తెచ్చివ్వాలని కోరారు.