Video: సికింద్రాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పల్టీలు కొట్టిన కారు.. సజ్జనార్ స్పందన
కారు ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Secunderabad: కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద కారు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు ఎక్స్ రోడ్ వద్ద మరో కారు ముందు భాగాన్ని ఢీ కొని పల్టీలు కొట్టింది. క్లబ్ వద్దకు రాగానే సిగ్నల్ పడుతోందన్న తొదరలో డ్రైవర్.. కారును వేగంగా నడిపించాడు.
సిగ్నల్ జంప్ చేస్తూ అడ్డుగా వచ్చిన మరో కారును బలంగా ఢీ కొట్టడంతో ఆ కారు మూడు పల్టీలు కొట్టింది. కారు డివైడర్ల మీదుగా పక్కకు పడిపోయింది. వెంటనే వాహనదారులతో పాటు ట్రాఫిక్ పోలీసులు వచ్చి కారులో ఉన్న వారిని బయటకు తీశారు.
కారులోని వారు స్వల్ప గాయలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసమయ్యాయి. కారు ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కారు ప్రమాద దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. నిబంధనలు పాటించకుండా కార్లను నడిపిన తీరుపై విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ఆర్టీసీఎండీ సజ్జనార్ స్పందిస్తూ.. ‘సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు. ప్రపంచమేం ఆగిపోదు.
గుర్తుపెట్టుకోండి.. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. అందుకు రహదారులపై విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేసి రోడ్డు ప్రమాదాలకు కారణమై.. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగల్చకండి’ అని ట్వీట్ చేశారు.
సిగ్నల్ పడ్డప్పుడు ఆగే ఓపిక కూడా కొందరు వాహనదారులకు లేకుండా పోతుండటం బాధాకరం. తొందరగా వెళ్లాలనే ఆత్రమే ఇలాంటి రోడ్డు ప్రమాదాలకు కారణం. ఒక్క నిమిషం ఆగితే కొంపలేం మునిగిపోవు. ప్రపంచమేం ఆగిపోదు.
గుర్తుపెట్టుకోండి.. ఇలా సిగ్నల్ బ్రేక్ చేయడం ప్రమాదకరం. రోడ్డు ప్రమాదాల నివారణ… pic.twitter.com/slK1SWbJe6
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 6, 2024
Also Read: వైసీపీకి ఓటువేసిన వారిని ఇళ్ల నుంచి బయటకు పిలిచి కొడుతున్నారు: గుడివాడ అమరనాథ్