Medigadda Project : మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటంపై కేంద్ర కమిటీ నియామకం.. రేపు ప్రాజెక్టు పరిశీలన

మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో వల్ల బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

Medigadda Project : మేడిగడ్డ ప్రాజెక్టు కుంగటంపై కేంద్ర కమిటీ నియామకం.. రేపు ప్రాజెక్టు పరిశీలన

Kaleswaram Medigadda Project Security

Updated On : October 23, 2023 / 3:00 PM IST

Medigadda Project Committee Appoint : కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టు భద్రతను పరిశీలించేందుకు నియమించిన కమిటీ రేపు(మంగళవారం) తెలంగాణకు రానుంది. కేంద్ర జల వనరుల సంఘం (ఎన్డీఎస్ఏ) చైర్మన్ అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రాజెక్టును సందర్శించి నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది.

మేడిగడ్డ రిజ్వాయర్ పిల్లర్లు కూలడంతో వల్ల బ్యారేజీ సామర్థ్యం పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర శకావత్ కు రాసిన లేఖలో డ్యామ్ భద్రతపై కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం వరకు తీసుకున్న నిర్ణయాలపై వాస్తవాలు తేల్చాలని కోరారు.

Chikkudu Prabhakar : కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ వంతెనపై హైకోర్టు సీజేకు లాయర్ చిక్కుడు ప్రభాకర్ లేఖ

మేడిగడ్డ ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోవడం దురదృష్టకరం అన్నారు. 6వ బ్లాక్ లోని గేట్ నెంబర్ 15 నుంచి 20 వరకు కుంగిపోయింది. పెద్ద శబ్ధాలు వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారని తెలిపారు. బ్యారేజీ 85 గేట్లు తెరవడంతో నీళ్లు వృథాగా కిందకు పోతున్నాయని పేర్కొన్నారు.