Ration : రేషన్ పంపిణీపై కేంద్రం సంచలన ఆదేశాలు.. మూడు నెలల రేషన్..

ప్రతి నెల 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఈ లెక్కన 3 నెలలకు సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి.

Ration : రేషన్ పంపిణీపై కేంద్రం సంచలన ఆదేశాలు.. మూడు నెలల రేషన్..

Updated On : May 21, 2025 / 5:43 PM IST

Ration : రేషన్ పంపిణీపై కేంద్రం సంచలన ఆదేశాలు జారీ చేసింది. 3 నెలల రేషన్‌‌‌‌ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలంది. జూన్, జూలై, ఆగస్ట్ నెలలకు సంబంధించిన రేషన్‌‌‌‌ కోటాను ఒకేసారి లబ్దిదారులకు పంపిణీ చేయాలని అన్ని రాష్ట్రాల సివిల్‌‌‌ సప్లయ్ అధికారులకు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ లేఖలు రాసింది. వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వానా కాలంలో ఆహార ధాన్యాల నిల్వ, రవాణలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా 3 నెలల రేషన్ ఒకే నెలలో ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.

మే 31లోగా లబ్ధిదారులకు రేషన్ ​అందించాలంది. ఇందుకోసం ఎఫ్‌‌‌‌సీఐ గోడౌన్లలో తగినంత నిల్వలు ఉండేలా చూసుకోవాలంది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Also Read: రేషన్‌ కార్డులకు అప్లయ్ చేశారా? మీకో బిగ్ అప్డేట్.. జూన్ మొదటి వారంలో..

కాగా.. తెలంగాణలో మే నెల కోటా రేషన్‌‌‌‌ బియ్యం పంపిణీ ప్రక్రియ పూర్తవుతున్న నేపథ్యంలో జూన్‌‌‌‌లో 3 నెలల కోటాను విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలిపినట్లు సమాచారం. ఈ మేరకు 3 నెలలకు కావాల్సిన సన్న బియ్యం సమకూర్చుకునేందుకు సివిల్‌‌‌‌ సప్లయ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్టేజ్‌‌‌‌ -1, స్టేజ్ ​2 గోదాముల్లో మే నెల పంపిణీకి పోగా ఇంకా ఎన్ని టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయనే వివరాలు సేకరిస్తున్నారు.

వీటి ఆధారంగా 3‌‌ నెలలకు సంబంధించిన రేషన్‌‌‌‌ కోటాను జూన్‌‌‌‌లోనే పంపిణీ చేసేలా ప్రణాళిక తయారు చేస్తున్నారు. ప్రతి నెల 1.75 లక్షల టన్నుల బియ్యం అవసరం. ఈ లెక్కన 3 నెలలకు సుమారు 5.25 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతాయి. ఈ క్రమంలోనే సన్న వడ్ల మిల్లింగ్‌‌‌‌ వేగవంతం‌‌ చేయాలని మిల్లర్లకు ఆదేశాలు జారీ చేశారు పౌరసరఫరాల శాఖ అధికారులు.