Ration Cards: రేషన్ కార్డులకు అప్లయ్ చేశారా? మీకో బిగ్ అప్డేట్.. జూన్ మొదటి వారంలో..
తాజాగా 4 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. చాలామంది రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది.

Ration Cards: మీరు రేషన్ కార్డు కోసం అప్లయ్ చేశారా? రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారా? మీకో బిగ్ అప్ డేట్. జూన్ నెల మొదటి వారంలో కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన మొదలు కానుంది. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారి తెలిపారు. భారీ సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని, పరిశీలనకు అదే పెద్ద అడ్డంకిగా మారిందని సమాచారం. హైదరాబాద్ నగరంలోని 9 సర్కిళ్ల పరిధిలో 6లక్షల 39వేల 451 రేషన్ కార్డులున్నాయి.
తాజాగా 4 లక్షల వరకు అప్లికేషన్లు వచ్చాయని సమాచారం. అయితే, చాలామంది రెండు మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నట్లు తేలింది. బల్దియా, కలెక్టరేట్, ప్రజావాణితో పాటు ఈసేవ ద్వారా ఇంకా అప్లికేషన్లు పెడుతూనే ఉన్నారు. వీటి వెరిఫికేషన్‌కు ప్రస్తుతం సీఆర్ఓ పరిధిలో అవసరమైనంత సిబ్బంది లేరని అధికారులు చెబుతున్నారు. అందుకే సిబ్బంది కావాలంటూ రెవెన్యూ, బల్దియాలకు లేఖలు రాశారట.
ఈ నెలాఖరులో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పై సిబ్బంది వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. వారు రాగానే జూన్ ఫస్ట్ వీక్ నుంచి రేషన్‌కార్డుల వెరిఫికేషన్, ఇంటింటి తనిఖీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అర్హుల గుర్తింపు ప్రక్రియ పూర్తవగానే.. కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. కాగా.. రేషన్ కార్డు దరఖాస్తు కోసం ఎలాంటి గడువు లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇది నిరంతర ప్రక్రియ అని అధికారులు స్పష్టం చేశారు.