కరోనాతో అంతా ఆగమాగం..తెలంగాణకు రూ. 70 వేల కోట్ల నష్టం

కరోనాతో అంత ఆగమాగం..ప్రజల ప్రాణాలు తీయడమే కాకుండా..ఆర్థికంగా కోలుకోని దెబ్బ తీస్తోంది. ఎన్నో రాష్ట్రాలకు ఆదాయం లేకపోవడంతో సతమతమవుతున్నాయి. మొదట్లో లాక్ డౌన్ విధించడంతో అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వాలకు తీరని నష్టం వాటిల్లింది. తెలంగాణ రాష్ట్రం కూడా భారీ నష్టాన్ని చవి చూడాల్సి వస్తోంది. వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని Centre for Economic and Social Studies (CESS) వెల్లడించింది. వ్యవసాయ రంగం మినహా…మిగతా రంగాలన్నీ తీవ్రంగా ప్రతికూల ఫలితాలను చవి చూశాయని తెలిపింది.
మొదట్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత..ఆర్థికాభివృద్ధిరేటు గణనీయంగా పెరిగిపోయింది. ప్రాధాన్యత రంగాలపై ఫోకస్ పెట్టడంతో GSDP లో వ్యవసాయ రంగం 16 శాతం, పారిశ్రామిక రంగం 19 శాతం, సేవల రంగం 65 వాటాలతో ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగిపోయింది. కానీ 2020, మార్చి నెలలో వచ్చిన కరోనా కారణంగా..కేంద్రం లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికక్కడ అన్నీ నిలిచిపోయయి. లక్షల మంది కార్మికులు ఉపాధి పోవడం, పనులు సాగకపోవడంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ రంగాలపై ఆధారపడిన కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా ప్రభావితమయ్యరు. రియల్ రంగంపై ఆధారపడిన వారందరూ నష్టాలు చవి చూశారు.
లాక్ డౌన్ లో రోజుకు రూ. 1, 784 కోట్లు నష్టపోయింది. కొన్ని రంగాల్లో రోజుకు రూ. 1200 కోట్లు నష్టపోయాయి. మొత్తం మీద రాష్ట్రానికి లాక్ డౌన్ కాలంలో దాదాపు రూ. 70 వేల కోట్ల నష్టం వచ్చిందని వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వానికి రూ. 7 వేల కోట్లు నష్టపోయిందని సెస్ తెలిపింది.
రాష్ట్రంలో పనిచేసే వారి వయస్సు 15 నుంచి 59 ఏండ్లున్న వారి జనాభ 2.5 కోట్లుగా ఉంటుంది. ఇందులో 1.34 కోట్ల మంది కార్మికులు, వీరిలో 31.91 లక్షల మంది రోజు వారి కూలీలున్నారు. 13, 08, 535 కూలీలు నిర్మాణ రంగంలో పని చేస్తున్నారు. 19.85 లక్షల మంది వ్యవసాయ రంగంలో పని చేస్తుండగా, 12.06 లక్షల మంది వ్యవసాయేతర రంగంలో పనిచేస్తున్నారు. వీరంతా దెబ్బతిన్నారు. కొంత వ్యవసాయ పనులు జరిగిన సంగతి తెలిసిందే. పట్టణాల్లో 40 శాతం, కార్మికుల్లో 13 శాతం, దినసరి కూలీలు తీవ్రంగా దెబ్బతిన్నారు.
ప్రస్తుతం కష్టాల నుంచి తెలంగాణ త్వరగానే కోలుకుంటుందని సెసె వెల్లడించింది. ఈ సందర్భంగా పలు సూచనలు చేసింది. వ్యవసాయం, వ్యవసాయేతర, స్వయం ఉపాధి రంగాల నుంచి ఆర్థికంగా బయటపడే అవకాశాలున్నాయని తెలిపింది. వ్యవసాయ పనులు ఆగకపోవడం వల్ల…ప్రజలకు ఇబ్బందులు తప్పాయి. తిండి గింజలతో పాటు పాలు, పండ్లు, కూరగాయలు, ఇతర నిత్యావసరాలకు ఇబ్బంది కలుగ లేదు. హోటల్ రంగంపై 80 శాతం ప్రభావం చూపింది.