సంక్షేమం అంటే ఎన్టీఆర్‌ : చంద్రబాబు

సంక్షేమం అంటే ఎన్టీఆర్‌ : చంద్రబాబు

Updated On : January 18, 2021 / 11:46 AM IST

Chandrababu paid tributes to NTR : ఎన్టీఆర్‌ 25వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎన్టీఆర్‌ సతీమణి, ఏపీ తెలుగు అకాడమి చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి, పలువురు ప్రముఖులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.

సోమవారం (జనవరి 18, 2021)న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఎన్టీఆర్‌ కు చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అంటే ఎన్టీఆర్‌ అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. దేశంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. పేదల కోసం ఆలోచించిన నిజమైన నేత ఆయనన్నారు చంద్రబాబు.

అంతకముందు ఎన్టీఆర్‌ సతీమణి, ఏపీ తెలుగు అకాడమి చైర్‌ పర్సన్‌ లక్ష్మీపార్వతి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో ఆయనకు నివాళులర్పించారు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికి మరచిపోలేని నాయకుడు ఎన్టీఆర్‌ అన్నారు. భావి తరాలను ఎన్టీఆర్‌ స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఎన్టీఆర్‌ హయాంలో చూసి రామరాజ్యాన్ని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ పాలనలో చూస్తున్నామన్నారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌లో సోదరులతో కలిసి తన తండ్రికి ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్‌ జాతి గర్వించదగ్గ నాయకుడన్నారు. ఎన్టీఆర్‌ మహోన్నత వ్యక్తి అన్నారు.