Cheruku Sudhakar : కోమటిరెడ్డి మాటలు క్రిమినల్ ఆలోచనతో ఉన్నాయి, వదిలి పెట్టేది లేదు-చెరుకు సుధాకర్
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపైన, తన కుటుంబంపైన చేసిన కామెంట్స్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోమటిరెడ్డిని తాను ఏ రోజూ, ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు చెరుకు సుధాకర్. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. కోమటిరెడ్డి మాటలు క్రిమినల్ ఆలోచనతో ఉన్నాయన్నారు. హాస్పిటల్ ను పేల్చేస్తాం, చంపేందుకు వందమంది తిరుగుతున్నారని చెప్పడం దారుణం అన్నారు.

Cheruku Sudhakar : కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చెరుకు సుధాకర్ మధ్య వివాదం తార స్థాయికి చేరింది. నా అభిమానులు మిమ్మల్ని చంపేందుకు తిరుగుతున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కుమారుడు చెరుకు సుహాస్ కు వార్నింగ్ ఇస్తూ కోమటిరెడ్డి చేసిన బెదిరింపుల అంశం తీవ్ర దుమారం రేపింది. దీన్ని చెరుకు సుధాకర్ సీరియస్ గా తీసుకున్నారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తనపైన, తన కుటుంబంపైన చేసిన కామెంట్స్ పై ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కోమటిరెడ్డిని తాను ఏ రోజూ, ఎలాంటి విమర్శలు చేయలేదన్నారు చెరుకు సుధాకర్. కోమటిరెడ్డి మాట్లాడిన మాటలు దారుణంగా ఉన్నాయన్నారు. కోమటిరెడ్డి మాటలు క్రిమినల్ ఆలోచనతో ఉన్నాయన్నారు. హాస్పిటల్ ను పేల్చేస్తాం, చంపేందుకు వందమంది తిరుగుతున్నారని చెప్పడం దారుణం అన్నారు.
కోమటిరెడ్డి వ్యవహారంపై నేతలందరితో చర్చించి ఒక డ్రాఫ్ట్ తయారు చేసి ముఖ్యమైన నేతలకు ఇస్తున్నామన్నారు. ఇది సామాన్యంగా తీసుకోవడం లేదన్నారాయన. తనకు, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఎలాంటి వైరం లేదన్నారు చెరుకు సుధాకర్. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే ఈ ఫిర్యాదు చేసినట్లు వివరించారు.
కోమటిరెడ్డి ఆర్ఎస్ఎస్ అజెండా అమలు చేస్తున్నారు?-అనిల్ కుమార్
కోమటిరెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ చెప్పారు. కొన్ని నెలలుగా వెంకట్ రెడ్డి తీరు చర్చనీయాంశంగా మారిందన్నారాయన. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ను కోమటిరెడ్డి మోసం చేశారని ఆరోపించారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొనకుండా ఆస్ట్రేలియా వెళ్లారని చెప్పారు. మొన్నటికి మొన్న కాంగ్రెస్ ను వీక్ చేసేలా పొత్తుల అంశం మాట్లాడారని అన్నారు. ఇప్పుడు ఒక బీసీ లీడర్ ను చంపేస్తా అంటూ మాట్లాడటం సమంజసం కాదన్నారు.
అద్దంకి దయాకర్ మాట దొర్లితే బహిరంగ క్షమాపణ కోరాడని ఆయన గుర్తు చేశారు. మైనారిటీ నేత షబ్బీర్ అలీను అవహేళన చేస్తూ మాట్లాడారని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోందన్నారు అనిల్ కుమార్. కాంగ్రెస్ కు బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలను దూరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతపై ఉందన్నారు.
కోమటిరెడ్డి చర్యల వల్ల అణగారిన వర్గాలు దూరం అవుతాయేమో అన్న భయం కలుగుతోందన్నారు. ఈ వ్యవహారంపై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ముందుకు రావాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ని నేనేమో అన్నానని నాకు షోకాజ్ నోటీసు ఇచ్చారని అనిల్ కుమార్ గుర్తు చేశారు. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి షోకాజ్ నోటీసు ఇచ్చి చిత్తశుద్ధి నిరూపించుకుంటారా? లేదా? అని ప్రశ్నించారు. అణగారిన వర్గాలకు నష్టం జరిగితే పార్టీకి కూడా నష్టం జరుగుతుందని ఆయన హెచ్చరించారు.
నీ తండ్రి చెరుకు సుధాకర్ ను చంపేందుకు తన మనుషులు తిరుగుతున్నారంటూ ఏకంగా.. ఆయన కొడుకు సుహాస్ కు వార్నింగ్ ఇస్తూ కోమటిరెడ్డి చేసిన ఫోన్ కాల్ దుమారం రేపింది. కాగా, చెరుకు సుధాకర్ తనయుడు సుహాస్‌తో ఫోన్ కాల్ లో మాట్లాడిన వ్యవహారంపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. సుహాస్‌తో ఫోన్‌కాల్‌లో భావోద్వేగంలో నోరు జారిన మాట వాస్తవమే అని అంగీకిరంచారు. పార్టీలో చేరిన దగ్గర నుంచి చెరుకు సుధాకర్ తనను తిడుతున్నారని.. ఎవరో మెప్పు కోసం నన్ను తిడితే ఎలా అంటూ నిలదీశారు. వీడియోలకు నీచంగా టైటిల్స్ పెడుతున్నారు.. ఎందుకు అలా పెడుతున్నారని మాత్రమే ప్రశ్నించానని అన్నారు. తాను మాట్లాడిన కొన్ని విషయాలు కట్ చేసి, మిగతావి మాత్రమే లీక్ చేశారని వాపోయారు.