Government Pensioners: డీఏలు పెంచడంతో సీఎంకు ఉద్యోగ సంఘాల స్పెషల్ థ్యాంక్స్

సీఎం కేసీఆర్ ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు. డీఏను పెంచుతూ తాజాగా కేబినెట్ లో నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

Government Pensioners: డీఏలు పెంచడంతో సీఎంకు ఉద్యోగ సంఘాల స్పెషల్ థ్యాంక్స్

Cm Kcr (2)

Updated On : January 20, 2022 / 7:31 AM IST

Government Pensioners: సీఎం కేసీఆర్ ప్రభుత్వ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించారు. డీఏను పెంచుతూ తాజాగా కేబినెట్ లో నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. పెరిగిన డీఏ మొత్తం 2021 జులై 1 నాటి నుంచి వర్తించనుంది.

జనవరి నెల పెన్షన్ లో పెరిగిన డీఏను తీసుకోవచ్చని స్పష్టం చేసింది ప్రభుత్వం. 3 విడతలుగా ఉన్న డీఏ బకాయిల చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇటీవల సమావేశమైన రాష్ట్ర మంత్రి మండలి ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న డీఏలను చెల్లించడానికి ఆమోదం తెలిపింది.

డీఏ బకాయిల చెల్లింపులు మూడు విడతలు కలిపి 10.01 శాతంగా ఉన్న మొత్తాన్ని జనవరి నెలలో చెల్లిస్తారు. మొదటి విడత.. 2020 జనవరి నుంచి జూన్ కు మధ్య ఉన్న ఆరు నెలలకు 3.64శాతం, రెండో విడత 2020 జులై-డిసెంబర్ కాలానికి 2.73 శాతం, మూడో విడత 2021 జనవరి-జూన్ కాలానికి 3.64 శాతంగా ఉన్నాయి.

పెన్షనర్లకు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆరు విడతల్లో బకాయిలు చెల్లిస్తారు. ఉద్యోగులకు మూడు డీఏలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘాల నేతలు. తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు పద్మాచారి, అధ్యక్షుడు రవీందర్ కుమార్, ప్రధాన కార్యదర్శి హర్ష కుమార్.. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఇది కూడా చదవండి: రెగ్యూలర్ మార్కెట్‌లోకి రానున్న కొవీషీల్డ్, కొవాగ్జిన్