Governor Tamilisai : రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం లేదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ పవర్ ఫుల్ లీడర్ : గవర్నర్ తమిళిసై
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.

Governor Tamilisai (2)
Governor Tamilisai – CM KCR : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని గవర్నర్ తమిళిసై అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్, పవర్ ఫుల్ నేత అని అభివర్ణించారు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన చూస్తున్నానని తెలిపారు. తాను ఆర్టీసీ కార్మికుల లబ్ధి కోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానని తెలిపారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుందని తెలిపారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదన్నారు.
రాజ్ భవన్ కు – ప్రగతి భవన్ కు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. గ్యాప్ అని తాను ఎప్పుడూ ఆలోచన చేయలేదన్నారు. తన ఫోకస్ అంతా ప్రజల అభివృద్ధిపైనేనని తెలిపారు. బిల్లుల విషయంలో జరిగిన చర్చపై తన అభిప్రాయం ప్రజా శ్రేయస్సే అని చెప్పారు. ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బిగినింగ్ ఆఫ్ ఫిఫ్త్ ఇయర్ ఇన్ థి సర్వీస్ ఆఫ్ పీపుల్ ఇఫ్ తెలంగాణ.. కాఫి టేబుల్ బుక్ ను గవర్నర్ ఆవిష్కరించారు.
CPI Narayana : గవర్నర్ తమిళిసైపై సీపీఐ నేత నారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు
అనంతరం గవర్నర్ తమిళసై మీడియాతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గవర్నర్ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్ నామినేషన్ కాదని స్పష్టం చేశారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి అర్హత ఫిల్ చేస్తే సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తమిళసై.. తెలంగాణ గవర్నర్ గా 4ఏళ్ళు పూర్తి చేసుకుని 5వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నారు. తెలంగాణలో తాను ప్రజలను కలిస్తే రాజకీయం చేయడం, విమర్శించడం చూస్తున్నానని చెప్పారు.
కానీ పుదుచ్చేరిలో ప్రతి నెల 15న ప్రజలను కలుస్తున్నా.. అక్కడి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారని తెలిపారు. తెలంగా బర్త్ డే, తన బర్త్ డే ఒక్కరోజేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు సేవ చేసే అవకాశం భగవంతుడు కల్పించాడని వెల్లడించారు. తెలంగాణ గవర్నర్ గా తాను 5వ సంవత్సరం కోనసాగించడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. తాను సవాళ్లకు భయపడనని స్పష్టం చేశారు.
Governor : టీఎస్ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
తాను ప్రోటో కాల్ ఉల్లంఘనలు, విమర్శలను పట్టించుకోనని చెప్పారు. ముందు కూడా తెలంగాణ ప్రజలు తనకు ఇదే విధంగా మద్దతు అందిస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. రాజ్ భవన్ ను ప్రజా భవన్ గా మార్చానని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై తెలిపారు. తెలంగాణ పండగులైన బోనాలు, బతుకమ్మను రాజ్ భవన్ లో జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. సమ్మక్క సారక్క జాతరలో పాల్గొన్న మొదటి గవర్నర్ ను తానేనని చెప్పారు.
ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రులను సందర్శించానని తెలిపారు. హైదరాబాద్ విమోచన దినోత్సవం తొలిసారి రాజ్ భవన్ లో జరుపుకున్నామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు రూరల్ ప్రాంత గ్రామాలకు పూర్తిగా అందడం లేదన్నారు. కొత్త రాష్ట్రం కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ కేంద్ర, రాష్ట్ర పథకాలు అందాలనేదే తన కోరిక అన్నారు.
Governor Tamilisai: ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. పాల్గొన్న తమిళిసై, కేసీఆర్
సనాతన ధర్మంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. తమిళనాడు లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ను అవమానించే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎవరి సాంప్రదాయాలు వాళ్లకు ఉంటాయని తెలిపారు. ఒక మతాన్ని, కులాన్ని చులకన చేసి చూడొద్దన్నారు. జమిలి ఎన్నికలకు తన మద్దతు ఉంటుందని చెప్పారు. అన్ని రకాలగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది మంచిదేనని పేర్కొన్నారు.