Governor Tamilisai: ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. పాల్గొన్న తమిళిసై, కేసీఆర్

సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో తమిళిసై‌, కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత..

Governor Tamilisai: ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం.. పాల్గొన్న తమిళిసై, కేసీఆర్

CM KCR, Governor Tamilisai

Updated On : August 25, 2023 / 1:46 PM IST

Governor Tamilisai – KCR: హైదరాబాద్‌(Hyderabad)లోని తెలంగాణ సచివాలయ (Telangana Secretariat) ప్రాంగణంలో నిర్మించిన మందిరం, చర్చి, మసీదుల ప్రారంభోత్సవంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కేసీఆర్, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, తదితరులు పాల్గొన్నారు.

సచివాలయంలోని నల్ల పోచమ్మ ఆలయ పూర్ణాహుతి కార్యక్రమంలో తమిళిసై‌, కేసీఆర్‌ పాల్గొన్నారు. ఆ తర్వాత చర్చి ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం మసీదును ప్రారంభించి, ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకు ముందు ఒకే వాహనంలో సచివాలయంలో తమిళిసై, కేసీఆర్ రావడం గమనార్హం. ఆ సమయంలో వాహనంలో ముందు సీట్లో తమిళిసై, వెనక సీట్లో కేసీఆర్ కూర్చున్నారు.

మూడు ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవం అనంతరం సచివాలయాన్ని తమిళిసై సందర్శించారు. ఆమె సచివాలయానికి రావడం ఇదే తొలిసారి. కొన్ని వారాల క్రితం జరిగిన సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళిసైకు ఆహ్వానం అందలేదన్న విషయం తెలిసిందే. ఇవాళ తమిళిసై చార్మినార్ భాగలక్ష్మి అమ్మవారిని కూడా సందర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

YSR Congress Party: అన్ని జిల్లాలకు వైసీపీ నూతన కార్యవర్గం.. ఆ రెండు జిల్లాలు మినహా అంతా పాతవారే..