CM KCR : రైతులందరికీ రైతుబంధు ఇస్తాం : సీఎం కేసీఆర్

హైదరాబాద్ లో శుక్రవారం నిర్వహించిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలెవరూ అధైర్యపడ వద్దని చెప్పారు.

CM KCR : రైతులందరికీ రైతుబంధు ఇస్తాం : సీఎం కేసీఆర్

Cm Kcr

Updated On : December 17, 2021 / 6:06 PM IST

CM KCR Key comments : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ నాయకులకు ఓపిక ఉండాలని పేర్కొన్నారు. కోటిరెడ్డి ఓపిక పట్టారు కాబట్టే ఈరోజు ఎమ్మెల్సీ అయ్యారని తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారికి పదువులు వస్తాయని పేర్కొన్నారు.

నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని ప్రకటించారు. శుక్రవారం (డిసెంబర్ 17,2021)న హైదరాబాద్ లో నిర్వహించిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నేతలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేతలెవరూ అధైర్యపడ వద్దని చెప్పారు.

Kadapa Tour : సీఎం జగన్ కడప జిల్లా టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నేతలకు సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. వరిసాగు అంశంలో రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. రైతులందరికీ రైతు బంధు ఇస్తామని స్పష్టం చేశారు.