CM KCR : నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని కోరుతూ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR : నేడు టీఆర్ఎస్ ఎంపీలతో సీఎం కేసీఆర్ భేటీ

Kcr

Updated On : July 16, 2022 / 8:01 AM IST

CM KCR meeting : ఇవాళ టీఆర్ఎస్‌ పార్లమెంట్ సభ్యులతో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ భేటీకానున్నారు. సోమవారం నుంచి పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభంకాబోతున్నాయి. దీంతో పార్టీ ఎంపీలతో కేసీఆర్‌ సమావేశమవుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించే వ్యూహాలపై చర్చించే అవకాశముంది. ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన విధి విధానాలపై గులాబీ బాస్‌ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు.

కేంద్రం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని ఎంపీలకు పిలుపునివ్వనున్నారు. లోక్‌సభ, రాజ్యసభలో పార్టీ ఎంపీలు అవలంభించవలసిన పలు కీలక అంశాలపై వారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయనున్నారు. పార్లమెంట్ వేదికగా పోరాటానికి పూనుకోవాలని కోరుతూ సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

CM KCR: కేంద్ర స‌ర్కారుపై కేసీఆర్ మ‌రోసారి పోరాటం.. విప‌క్ష నేత‌లు, సీఎంల‌కు ఫోన్లు

కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలు కోసం పార్లమెంట్‌ వేదికగా పోరాటంపై చర్చించనున్నారు. కేంద్రమంత్రులను కలుస్తూ నిధులు రాబట్టేందుకు ప్రయత్నించాలని దిశానిర్దేశం చేయనున్నారు. ఒకవైపు సభలో పోరాడుతూనే.. మరోవైపు కేంద్రమంత్రులకు సమస్యలపై వినతిపత్రాలు అందజేయాలని సూచించే అవకాశముంది.