అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న కేసీఆర్

కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ(మే-6,2019) సాయంత్రం తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. మరికాసేపట్లో కేరళ సీఎం పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు తిరువనంతపురం ఎయిర్ పోర్టులో తెలుగు సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు.