CM KCR Independent Festivals : జాతిపిత గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారు : సీఎం కేసీఆర్
దేశఖ్యాతిని గాంధీజీ ప్రపంచవ్యాప్తం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం గురించి నేటి యువతకు తెలియాలని తెలిపారు. జాతిపిత గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ముగింపు వేడుకులకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.

CM KCR Independent Festivals
CM KCR Independent Festivals : దేశఖ్యాతిని గాంధీజీ ప్రపంచవ్యాప్తం చేశారని సీఎం కేసీఆర్ అన్నారు. గాంధీజీ స్వాతంత్ర్య పోరాటం గురించి నేటి యువతకు తెలియాలని తెలిపారు. జాతిపిత గురించి కొందరు అల్పులు నీచంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఎల్బీ స్టేడియంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ముగింపు వేడుకులకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేసి, జాతీయ గీతాలాపన చేశారు. గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ నేటి తరానికి స్వాతంత్ర్య స్ఫూర్తిని తెలియజెప్పేందుకే ఈ కార్యక్రమం అన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నానని పేర్కొన్నారు.
కోటి మందితో సామూహిక జాతీయ గీతాలాపన చేయడం గర్వ కారణం అన్నారు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.