వాళ్లిద్దరు కలిసి తెలంగాణకు ద్రోహం చేశారు.. సబితమ్మ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు? : సీఎం రేవంత్
మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీ నష్టదాయకం అని ఐదుగురు సభ్యుల ఇంజినీర్స్ కమిటీ నివేదిక ఇచ్చారు.. గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి కేసీఆర్ ఆలోచన ప్రకారం ...

Sabitha Indra Reddy
TS Assembly 2024 : అసెంబ్లీ సమావేశాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాడివేడిగా చర్చజరిగింది. చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగ బద్ద సంస్థలు మాట్లాడిన మాటలు మేము సభలో చెప్పాం. ఎవరి అభిప్రాయంను వారు చెప్పొచ్చు. మేము వద్దని అడ్డుకోము, చెప్పలేము. కాళేశ్వరంపై కొంతమంది రిటైర్డ్ ఇంజనీరింగ్ అధికారులతో కమిటీ వేసి ఆయనకు ఇష్టం వచ్చినట్లు రిపోర్ట్ ను మాజీ సీఎం కేసీఆర్ తయారు చేయించుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక సైనికుడు లాగా బరువెక్కిన గుండె చేసుకుని గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మన సభ ముందు ఉంచారు. బీఆర్ఎస్ హయాంలో తప్పులు జరిగాయని తేటతెల్లం అయింది. గతంలో చేసిన తప్పుల్ని ఒప్పుకుని మాజీ మంత్రి హరీశ్ రావు క్షమాపణలు చెప్పి.. ఇప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వాలి. కానీ, మళ్లీ తప్పులను కప్పిపెట్టడానికి మాజీ మంత్రి ప్రయత్నం చేస్తే ఎలా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
Also Read : KCR Birthday : కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి..
మేడిగడ్డ వద్ద గోదావరిపై బ్యారేజీ నష్టదాయకం అని ఐదుగురు సభ్యుల ఇంజినీర్స్ కమిటీ నివేదిక ఇచ్చారు.. గత ప్రభుత్వం ఆ నివేదికను తొక్కిపెట్టి కేసీఆర్ ఆలోచన ప్రకారం మేడిగడ్డ వద్ద బ్యారేజీ కట్టారు. వాళ్లు వేసుకున్న కమిటీ మేడిగడ్డ దగ్గర బ్యారేజీ కట్టకూడదని అప్పుడే చెప్పారు. అయిన వాళ్ల మాట వినకుండా అక్కడే ప్రాజెక్ట్ కట్టారు. నా మిత్రుడు హరీశ్ రావు మారాడని అనుకున్నా.. కానీ, ఆ పరిస్థితి కనిపించడం లేదు. హరీశ్ రావు, వాళ్ల మామ కేసీఆర్ కలిసి తెలంగాణకు ద్రోహం చేశారంటూ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగిందనే తెలంగాణ ఉద్యమం జరిగింది.. తెలంగాణ వచ్చాక ఆ అన్యాయం మరింతగా జరిగిందని రేవంత్ అన్నారు. తెలంగాణ ఇచ్చింది మేమే.. తెచ్చింది మేమే చెప్పుకుంటున్నారు.. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ ఎక్కడ ఉన్నారు? అంటూ రేవంత్ ప్రశ్నించారు. పార్లమెంట్ లో పెప్పర్ స్ప్రే బారిన పడింది మా కాంగ్రెస్ ఎంపీలే అంటూ రేవంత్ అన్నారు.
Also Read : మీరు చెప్పినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. అసెంబ్లీలోకి అడుగుపెట్టను : హరీశ్ రావు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే సబితా ఇంద్రారెడ్డి కూడా ధర్నా చేశారు. కానీ, ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తమ్ముళ్లు తప్పుచేస్తే అక్కలు చెప్పాలి కదా.. కానీ, సబితా ఇంద్రారెడ్డి మాట్లాడడం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి పోరాటం చేసిన సబితా ఇంద్రారెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదంటూ సీఎం రేవంత్ సభలో ప్రశ్నించారు.