పాడి కౌశిక్ రెడ్డి ఉదంతంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో చేసింది బీఆర్ఎస్ వాళ్లేనని, ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు.

పాడి కౌశిక్ రెడ్డి ఉదంతంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్..

Cm Revanth Reddy : బతకటానికి వచ్చినోళ్లు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనిపై కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. పీఏసీ పదవి ప్రతిపక్షానికే ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ లకు తెలియకుండా కౌశిక్ రెడ్డి మాట్లాడితే పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

పార్టీ ఫిరాయింపులను పూర్తి స్థాయిలో చేసింది బీఆర్ఎస్ వాళ్లేనని, ఇప్పుడు తమకు నీతులు చెబుతున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేల వ్యవహారం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందని.. దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి భాషపై బీఆర్ఎస్ అధినేత స్పష్టత ఇవ్వాలన్నారు సీఎం రేవంత్.

పాడి కౌశిక్ రెడ్డి ఉదంతంపై ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్..
* బతకడానికి వచ్చిన వాళ్లు అనే మాట ఎందుకు వాడారు?
* దీనిపై కేసీఆర్ కుటుంబం క్షమాపణ చెప్పాలి
* వారికి తెలియకుండా మాట్లాడి ఉంటే వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
* రూల్స్ ప్రకారమే పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్షానికి ఇచ్చాం
* 2019 నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ పీఏసీ ఛైర్మన్ గా ఎలా ఉన్నారు?
* కాంగ్రెస్ ప్రతిపక్షంగా ఉండగా ఎంఐఎంకు పీఏసీ ఎలా ఇచ్చారు?

Also Read : నీలాంటి బ్రోకర్ల వల్లే పార్టీ వీడుతున్నారు- కౌశిక్ రెడ్డిపై అరెకపూడి గాంధీ ఫైర్