కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

కొత్త రేషన్ కార్డులపై సీఎం రేవంత్ కీలక ప్రకటన..

New Ration Cards (Photo Credit : Google)

New Ration Cards : కొత్త రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17 నుంచి 10 రోజుల పాటు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టనుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల కోసం అధికారులు వివరాలు సేకరించనున్నారు. పూర్తి హెల్త్ ప్రొఫైల్ తో రాష్ట్రంలో ప్రతి పౌరుడికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని, ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారులను సన్నద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

స్పీడ్ పై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉస్మానియా ఆసుపత్రిని గోశామహల్ కు తరలించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి భూ బదలాయింపు ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆర్కిటెక్ట్స్ తో డిజైన్లను రూపొందించాలని సీఎం రేవంత్ చెప్పారు. వచ్చే 50 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రి నిర్మాణం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. భవిష్యత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా డిజైన్లు ఉండేలా చూడాలన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా రోడ్ కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గోశామహల్ సిటీ పోలీస్ అకాడమీకి ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయించాలని చెప్పారు.

Also Read : జన్వాడ ఫామ్‌హౌస్ కూల్చివేతకు హైడ్రా రెడీ..? రంగంలోకి ఇరిగేషన్ అధికారులు..