Cm Revanth Reddy: ఢిల్లీ, చెన్నైలా హైదరాబాద్ కాకుండా చర్యలు, న్యూయార్క్‌తో పోటీ పడేలా కృషి- సీఎం రేవంత్ రెడ్డి

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు ఓపెన్ స్పేస్ ఉంటుంది.

Cm Revanth Reddy: ఢిల్లీ, చెన్నైలా హైదరాబాద్ కాకుండా చర్యలు, న్యూయార్క్‌తో పోటీ పడేలా కృషి- సీఎం రేవంత్ రెడ్డి

Updated On : June 28, 2025 / 7:44 PM IST

Cm Revanth Reddy: ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లో ఎదురవుతున్న సమస్యలు హైదరాబాద్ కు రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని న్యూయార్క్, టోక్యో నగరాలతో పోటీ పడేలా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. రాబోయే 100 రోజుల్లో కోర్ అర్బన్ ప్లాన్ తయారు చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాద్ నగరం అభివృద్ధిలో అందరూ భాగం కావాలని పిలుపునిచ్చారు.

జంట నగరాలలో పాతికేళ్లు PJR శకం నడిచిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలు పిలిస్తే పలికే వ్యక్తిగా PJR గుర్తింపు పొందారు. సీఎల్పీ లీడర్ గా అనేక సేవలు చేశారని చెప్పారు. హైదరాబాద్ నగరంలో అప్పట్లో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేసింది PJR పోరాటమే అని రేవంత్ చెప్పారు. పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ సభలో సీఎం రేవంత్ మాట్లాడారు.

పీజేఆర్ ఫ్లై ఓవర్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. పీజేఆర్ కృషితోనే నగరంలోకి సురక్షిత మంచినీరు వచ్చిందన్నారు. పీజేఆర్ నేతృత్వంలోనే హైటెక్ సిటీకి పునాది పడిందని చెప్పారు. కార్మికుల శ్రేయస్సు కోసం పీజేఆర్ కృషి చేశారని అన్నారు. హైదరాబాద్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రపంచ దేశాలతో హైదరాబాద్ పోటీ పడాలన్నారు. 3 క్లస్టర్లుగా విభజించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని సీఎం రేవంత్ వెల్లడించారు. అయితే కొందరు వ్యక్తులు కోర్టుల్లో కేసులు వేస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్నికలప్పుడే రాజకీయం అని, ఇప్పుడు అభివృద్ధే లక్ష్యం అని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

”దేశంలోనే అతిపెద్ద.. అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గానికి PJR MLA గా ఉన్నారు. 500 ల ఫార్చ్యూన్ కంపెనీలలో 80 వరకు ఫార్చ్యూన్ కంపెనీలు ఇప్పుడు ఐటీ ప్రాంతంలో ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో డీజిల్ బస్సులు కాకుండా ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేస్తాం. ఆటో కార్మికులు ఎలక్ట్రిక్, CNG ఆటోలు కొనుక్కోవాలి. EV వాహనాలకు TAX ఫ్రీ చేశాము. నగరంలో వరదలు తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైడ్రా ద్వారా నాలాలు, చెరువుల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. డిసెంబర్ 9 లోపల కోర్ అర్బన్ డాక్యుమెంట్ తయారు చేస్తాం.

Also Read: చావుకు కూడా భయపడను.. నన్ను రెచ్చగొట్టొద్దు.. బీసీలను గౌరవించాలని కోరా- కొండా మురళి

భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 వేల ఎకరాల్లో 15 వేల ఎకరాలు ఓపెన్ స్పేస్ ఉంటుంది. అప్పట్లో ORR.. అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది. స్థానిక MLA ఎలాంటి అభివృద్ధి ప్లాన్ చేసినా మేము నిధులు ఇస్తాము. 2029లో శేరిలింగంపల్లి నియోజకవర్గం 4 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది” అని సీఎం రేవంత్ అన్నారు.