Konda Murali: చావుకు కూడా భయపడను.. నాతో పెట్టుకోవద్దు.. బీసీలను గౌరవించాలని కోరా- కొండా మురళి

రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు.

Konda Murali: చావుకు కూడా భయపడను.. నాతో పెట్టుకోవద్దు.. బీసీలను గౌరవించాలని కోరా- కొండా మురళి

Updated On : June 28, 2025 / 4:51 PM IST

Konda Murali: కాంగ్రెస్ నేతలు కొండా మురళి, కడియం శ్రీహరి మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. గాంధీభవన్ లో క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన కొండా మురళి మరోసారి కడియం శ్రీహరిపై మండిపడ్డారు. నన్ను రెచ్చగొట్టొద్దు అని అన్నారు. నేను చావుకు కూడా భయపడను అని చెప్పారు. నేను రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చాను అన్న కొండా మురళి.. కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలన్నారు. బీసీలను గౌరవించాలని తాను కోరానని చెప్పారు. నేను దేనికీ భయపడను అని అన్నారు.

”సీఎం, పీసీసీ అంటే గౌరవం ఉంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వరంగల్ లో మాట్లాడతా. కాంగ్రెస్ పార్టీ అంటే నాకు గౌరవం. వైఎస్సార్ తో కాంగ్రెస్ పై నాకు అభిమానం పెరిగింది. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే తపన నాలో ఉంది. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో కాదో నా అంతరాత్మకు తెలుసు. నేను బలహీనుడినో, బలవంతుడినో అందరికీ తెలుసు. నన్ను రెచ్చగొట్టొద్దు. మంత్రులు కొండా సురేఖ, సీతక్క మధ్య గ్యాప్ ఉందని ప్రచారం చేస్తున్నారు” అని కొండా మురళి అన్నారు.

వరంగల్ కాంగ్రెస్ నేతల మధ్య వ్యవహారం చినికి చినికి గాలివానగా మారింది. వివాదం తీవ్రం కావడంతో పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ వ్యవహారానికి తెరదించాలని చూసింది. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. క్రమశిక్షణ కమిటీ సూచనతో ఇవాళ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గాంధీభవన్ కు వచ్చారు. తనపై వచ్చిన ఫిర్యాదులపై వివరణ ఇచ్చిన కొండా మురళి.. రివర్స్ కంప్లైంట్ ఇచ్చారు.

తనతో ఎవరెవరు ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నారు, వాస్తవ పరిస్థితులు ఏంటనే దానికి సంబంధించి 15 పేజీల లేఖను అందించారు. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించిన అంశంపై డీటైల్ గా నివేదించారు. వరంగల్ వెస్ట్, పరకాల, స్టేషన్ ఘన్ పూర్, వర్దన్నపేట, భూపాలపల్లి ఎమ్మెల్యేలకు సంబంధించి ఫిర్యాదులు ఇచ్చారు. దానికి సంబంధించి రాతపూర్వకంగా మరొకసారి సమాధానం ఇవ్వాలని కొండా మురళికి క్రమశిక్షణ కమిటీ సూచించింది. క్రమశిక్షణ కమిటీతో భేటీ తర్వాత బయటకు వచ్చిన కొండా మురళి.. మరోసారి అదే స్వరంతో మాట్లాడారు.

కడియం శ్రీహరిపై అంతే ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేసి వచ్చారా? లేదా? అని ప్రశ్నించారు. తాను పార్టీ మారినప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చేటప్పుడు బీఆర్ఎస్ పార్టీకి, పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి వచ్చానని తెలిపారు. కానీ కడియం శ్రీహరి రాజీనామా చేసి వచ్చారా లేదా అని ప్రశ్నించారు. అనవసరంగా వివాదం పెద్దది చేయొద్దని, తన జోలికి రావొద్దని, తన జోలికి వస్తే తాను ఊరుకోనని కొండా మురళి హెచ్చరించారు.

Also Read: ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు: కేటీఆర్