Cm Revanth Reddy: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ రోడ్ల నిర్మాణాలకు సహకరించాలని విన్నపం

ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు.

Cm Revanth Reddy: కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ.. ఆ రోడ్ల నిర్మాణాలకు సహకరించాలని విన్నపం

Updated On : May 6, 2025 / 12:49 AM IST

Cm Revanth Reddy: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు, రేడియల్ రోడ్ల నిర్మాణాలపై గడ్కరీతో చర్చించారు. ఇప్పటికే టెండర్లను పిలిచినా RRR ఉత్తర భాగానికి త్వరగా ఫైనాన్షియల్, కేబినెట్ ఆమోదం తెలపాలని కేంద్రమంత్రిని కోరారు సీఎం రేవంత్. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంతో పాటు దక్షిణ భాగాన్ని ఏకకాలంలో పూర్తి చేసేందుకు సహకరించాలని కోరారు. ఎన్ హెచ్ 765 లోని హైదరాబాద్- శ్రీశైలం సెక్షన్ కు సంబంధించి మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు ఎలివేటెడ్ కారిడార్ మంజూరు చేయాలని కోరారు.

Also Read: ఐదేళ్ల తర్వాత కైలాస మానసరోవర యాత్ర.. ఎవరెవరు వెళ్లొచ్చు, అర్హతలు నిబంధనలేంటి, దరఖాస్తు ఎలా చేసుకోవాలి.. పూర్తి వివరాలు..

హైదరాబాద్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే ను వీలైనంత త్వరగా మంజూరు చేయాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ORR, RRR లను కలుపుతూ రేడియల్ రోడ్ల అభివృద్ధి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు రేవంత్. హైదరాబాద్-డిండి- మన్ననూర్, హైదరాబాద్- మంచిర్యాల గ్రీన్ ఫీల్డ్ హైవే, ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు రేడియల్ రోడ్ అభివృద్ధి పనులకు సంబంధించి వెంటనే మంజూరు చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీకి విన్నవించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..