కొడంగల్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ పర్యటన.. కొస్గీలో బహిరంగ సభ.. పూర్తి షెడ్యూల్ ఇలా
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో ఇవాళ పర్యటించనున్నారు.

CM Revanth Reddy
CM Revanth Reddy Kodangal Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ పర్యటనకు రెడీ అయ్యారు. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి సొంత నియోజకవర్గానికి సీఎం వెళ్తున్నారు. నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 5గంటలకు కొస్గీలో జరిగే కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొంటారు.
Also Read : టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి
హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 3గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని కొస్గీకి రేవంత్ రెడ్డి చేరుకుంటారు. తొలుత ఆర్అండ్ బి గెస్ట్ హౌస్ కు, డబుల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తరువాత రూ. 5కోట్లతో నిర్మించనున్న ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కు, రూ. 25కోట్లతో నిర్మించనున్న మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం దౌల్తాబాద్, బొమ్మనాస్పెట్ మీటూర్ లో జూనియర్ కాలేజీ భవనాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. అదేవిధంగా చంద్రకల్ లో పశువైద్య కళాకశాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారు.