టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తామని.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి దీమా వ్యక్తం చేశారు.

టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తాం: వైవీ సుబ్బారెడ్డి

yv subba reddy confident ysrcp clean sweep in assembly polls

Updated On : February 21, 2024 / 10:42 AM IST

YV Subba Reddy: రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని క్లీన్ స్వీప్ చేశామని.. వచ్చే ఎన్నికల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన బుధవారం ఉదయం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌స‌భ‌ ఎన్నికల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని, అసెంబ్లీ ఎన్నికల్లోనూ హవా చూపిస్తామని అన్నారు.

”రాజ్యసభ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆశీస్సులతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాం. సంఖ్య బలం లేకపోయినా ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థిని బరిలో నిలిచేందుకు ప్రయత్నం చేసింది. మేమంతా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలలో ఇదే విజయం కొనసాగుతుంది. స్టెప్ బై స్టెప్ టీడీపీని ఖాళీ చేసుకుంటూ వస్తున్నాం. అసెంబ్లీ, లోక్‌స‌భ‌లో టీడీపీని ఖాళీ చేశాం.. ఇప్పుడు పెద్దల సభలోలను టీడీపీని ఖాళీ చేశాం. సాధారణ ఎన్నికల్లో ఫలితాలు కూడా ఇకపై ఇలాగే రిపీట్ అవుతాయి. టీడీపీని రాబోయే ఎన్నికల్లో ఖాళీ చేస్తాం. టీడీపీ, కాంగ్రెస్ ప్రలోభాలతో పార్టీలు మారిన వాళ్లు తిరిగి వైసీపీలోకి వస్తారు. ప్రజా బలం ముందు ప్రలోభాలు పని చేయవ”ని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.

కాగా, రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీ నుంచి వైవీ సుబ్బారెడ్డి, మేడా మల్లిఖార్జునరెడ్డి, గొల్ల బాబూరావు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ మూడు స్థానాలకు దక్కించుకోవడంతో రాజ్యసభలో వైసీపీ బలం 11కు చేరుకుంది.

Also Read: రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై త్వరలో స్పీకర్ నిర్ణయం.. ఏం జరగనుంది?