రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై త్వరలో స్పీకర్ నిర్ణయం.. ఏం జరగనుంది?

అవకాశాలు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదనే విషయాన్ని ప్రస్తావించారు స్పీకర్.

రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై త్వరలో స్పీకర్ నిర్ణయం.. ఏం జరగనుంది?

Rebel MLAs

Updated On : February 20, 2024 / 11:38 PM IST

Rebel MLAs : ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రెబల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసినట్టు స్పీకర్ స్పష్టం చేశారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలకు ఈ మేరకు స్పీకర్ పేషీ నుంచి లేఖలు పంపారు. విచారణకు అవకాశం ఇచ్చినా రెబల్ ఎమ్మెల్యేలు సద్వినియోగం చేసుకోలేదని లేఖలో వెల్లడించారు. ఈ నెల 19వ తేదీన చివరి విచారణ ఉంటుందని చెప్పినా.. హాజరుకాకపోవడాన్ని లేఖల్లో ప్రస్తావించారు స్పీకర్.

Also Read : పైకి పొత్తులు.. లోపల కత్తులు..? టీడీపీ-జనసేన అభ్యర్థుల ప్రకటనలో ఆలస్యానికి కారణం అదేనా?

అవకాశాలు ఇచ్చినా విచారణకు హాజరుకాలేదనే విషయాన్ని ప్రస్తావించారు స్పీకర్. ఇకపై విచారణలు ఉండబోవని లేఖలో సంకేతాలు ఇచ్చారు. అనర్హత పిటిషన్లపై త్వరలో నిర్ణయాన్ని ప్రకటించబోతున్నట్లుగా తేల్చి చెప్పారు స్పీకర్ తమ్మినేని. ప్రస్తుతానికి అనర్హత పిటిషన్లపై తన నిర్ణయాన్ని రిజర్వ్ లో పెట్టారు స్పీకర్ తమ్మినేని సీతారాం.

రెబల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి(వైసీపీ).. కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేశ్ (టీడీపీ) నోటీసులు అందుకున్నారు.