జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు

Telangana CM Revanth Reddy

Updated On : December 3, 2024 / 5:16 PM IST

ప్రజాపాలన ఉత్సవాల్లో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.3.500 కోట్లతో రహదారి అభివృది సమలకు సీఎం శంకుస్థాపన చేశారు. రూ.16.50 కోటతో నిర్మించిన భూగర సంపుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చేతులమీదుగా దేశంలోనే అతిపెద్ద ఎస్టీపీ ప్రారంభ కార్యక్రమం జరిగింది.

శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవే..

  • జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆరాంఘర్-బహుదూర్పుర బారీ ఫ్లై ఓవర్
  • జీహెచ్ఎంసీలోని 108 జంక్షన్ లలో 150 కోట్లతో చేపట్టిన బ్యూటీఫికేషన్ పనులు
  • వర్షం నీటిని నిలువచేసే భూగర్భ నీటి సంపులను 17 కోట్లతో జీహెచ్ఎంసీ నిర్మిస్తుంది అందులో నాలుగు పూర్తి అయ్యాయి. వాటి ప్రారంభోత్సవం..
  • వాటర్ బోర్డు ఆధ్వర్యంలో పూర్తిచేసిన ఆరు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ప్రారంభం
  • గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హెచ్సీటీ పేరుతో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
  • కేబీఆర్ పార్కు చుట్టూ ఆరు జంక్షన్లలో ఫ్లై ఓవర్లు అండర్ పాసుల నిర్మాణానికి శంకుస్థాపన
  • రూ.568 కోట్లతో చేపట్టే ఎస్ఎన్డీపీ పనులకు కూడా శంకుస్థాపన

సోషల్ మీడియాలో ఎవరో పెట్టిన పోస్టుకు నా మీద కేసు పెట్టారు: హరీశ్ రావు