CM Revanth on KCR Health: కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ ఆరా.. కేసీఆర్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు
ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసన వెంటనే ప్రభుత్వం స్పందించింది

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. కేసీఆర్కు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ కార్యదర్శి హుటాహుటిన యశోద ఆసుపత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి, ఆయనకు అందుతున్న వైద్యం గురించి యశోద ఆసుపత్రి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని యశోద వైద్యులు తెలిపారు.
వాస్తవానికి ఈ విషయం రాత్రే ప్రభుత్వ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. రాత్రి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించింది. వెంటనే గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ క్లియరెన్స్ తో పోలీస్ అధికారుల భద్రత నడుమ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి కేసీఆర్ ఆరోగ్యం గురించి ప్రభుత్వ ఆరోగ్య శాఖ పరిశీలిస్తూనే ఉంది.
తన వ్యవసాయ క్షేత్రంలోని నివాసంలో ఆయన కాలు జారి కింద పడ్డారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆయన కాలి ఎముక విరిగిందని వైద్యులు గుర్తించారు. అంతే కాకుండా, ఈ ప్రమాదంతో గతంలో విరిగిన కాలు గాయం మరోసారి తిరగబెట్టిందని వైద్యులు తెలిపారు. వెంటనే ఆయనను యశోదా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు.
Also Read: కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్.. యశోద వైద్యులు ఏం చెప్పారంటే?
ఇక ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం ప్రజాభవన్ లో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తర్వాత ఆయన సెక్రటేరియట్ కు వెళ్లారు. విద్యుత్ శాఖపై అత్యున్నత సమీక్ష సమావేశం నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీయడం జరిగింది.
ఆసుపత్రిని సందర్శించి, ఆయనకు మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని ఆరోగ్య శాఖ కార్యదర్శిని ఆదేశించడం జరిగింది.
కేసీఆర్ గారు త్వరగా కోలుకోవాలని…
— Revanth Reddy (@revanth_anumula) December 8, 2023