Hyderabad metro: గుడ్‌న్యూస్.. హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణ.. రేవంత్ కీలక నిర్ణయం
పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

HYD Metro
హైదరాబాద్ నార్త్ సిటీ వైపు మెట్రో విస్తరణకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. మేడ్చల్, షామీర్‌పేట్ వైపు మెట్రో పొడిగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు.
డీపీఆర్ సిద్ధం చేయాలంటూ అధికారులను ఆదేశించారు. పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు 23 కిలోమీటర్లు, జేబీఎస్ నుంచి షామీర్‌పేట్ వరకు 22 కిలోమీటర్లు మెట్రో కారిడార్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.
వెంటనే డీపీఆర్‌ను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేస్ 2 ‘బీ’ పేరుతో కేంద్ర ప్రభుత్వం అనుమతికి పంపించాల్సిందిగా మెట్రో అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మునిసిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, మెట్రో రైల్ ఎండీతో ఈ మార్గంపై రేవంత్ రెడ్డి సమీక్షించారు. మూడు నెలల్లో డీపీఆర్ పూర్తి చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, హైదరాబాద్‌లో ఇప్పటికే మూడు మార్గాల్లో మెట్రో సేవలు అందిస్తోంది. ఈ మెట్రో రైళ్లలో ప్రతి రోజు దాదాపు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఉద్యోగస్థులు వెళ్లే సమయంలో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి.
న్యూఇయర్ సంబరాల కోసం ఆన్‌లైన్‌లో యూజర్లు అత్యధికంగా ఏమేం బుక్ చేసుకున్నారో తెలుసా?