GHMC: 36 గంటల్లో 15,000.. కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

నగరంలోని అంబర్‭పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గంటల్లో సుమారు 15 వేల ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది

GHMC: 36 గంటల్లో 15,000.. కుక్కల బెడదపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

Complaints to GHMC on street dogs

Updated On : February 24, 2023 / 2:59 PM IST

GHMC: నగరంలోని అంబర్‭పేటలో ఒక చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి హతమార్చిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా వీధి కుక్కలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీకి అయితే ఈ ఫిర్యాదులు వందలు దాటి వేలకు చేరుకున్నాయి. గడిచిన 36 గంటల్లో సుమారు 15 వేల ఫిర్యాదులు అందాయని జీహెచ్ఎంసీ వెల్లడించింది. గంటకు 416 ఫిర్యాదులు వస్తున్నాయట. జీహెచ్ఎంసీలోని 30 సర్కిళ్ల పరిధిలో ప్రతిరోజు 10 ఫిర్యదులపై స్పందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక దీనిపై ప్రత్యేక ఆపరేషన్ టీంలను సైతం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలోని ఐదు ప్రాంతాల్లో షెల్టర్ హోంలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం రోజుకు 150 ఆపరేషన్లు మాత్రమే జీహెచ్ఎంసీ చేస్తోంది. ఈ సామర్థ్యాన్ని మరింత పేంచే ప్రయత్నం చేస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది.

Medico Preeti Case: ర్యాగింగ్ కాదు, ఆ కారణం వల్లే ఆత్మహత్యాయత్నం.. వైద్య విద్యార్థి ప్రీతి కేసుపై వరంగల్ సీపీ కీలక విషయాలు