HCA Meeting Conflicts : అంబుడ్స్‌మన్ ఎంపికపై హెచ్‌సీఏలో విభేదాలు..స్టేజ్‌పైనే గొడవపడ్డ అజారుద్దీన్, విజయానంద్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య భేటీలో అంబుడ్స్‌మెన్ ఎంపికపై రగడ జరిగింది.

Conflicts Once Again At The Hca Annual General Meeting
Conflicts at the HCA Annual General Meeting : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. హెచ్‌సీఏ వార్షిక సర్వసభ్య భేటీలో అంబుడ్స్‌మెన్ ఎంపికపై రగడ జరిగింది. స్టేజ్‌పైనే అజారుద్దీన్, విజయానంద్ గొడవపడ్డారు.
క్రికెట్ అభివృద్ధే తన ధ్యేయమన్న అజారుద్దీన్.. కొంతమంది తన పనులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కావాలని గొడవ చేసే వారికి షోకాజ్ నోటీస్ ఇవ్వడంతో పాటు వారిని సస్పెండ్ చేస్తానంటూ అజార్ వార్నింగ్ ఇచ్చాడు.
హెచ్‌సీఏలో గొడవలపై బీసీసీఐ సీరియస్‌గా ఉందని చెప్పాడు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా జస్టిస్ దీపక్‌వర్మ ఎంపికయ్యారు.