ఏడాది పాలనపై విజయోత్సవాలకు కాంగ్రెస్ ప్లాన్.. ఓ హామీ అమలు, మరో పథకం గైడ్‌లైన్స్‌పై కసరత్తు?
రైతు భరోసాతో పాటు.. మహిళలకు నెలకు 2వేల 5వందలు ఇచ్చే స్కీమ్ మీద కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy
Congress: పవర్‌లోకి వచ్చాం. వన్ ఇయర్ అవుతోంది. అంతా బానే ఉంది. కానీ గ్రౌండ్‌లో పొజీషనే టెన్షన్ పెడుతోందట. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. వన్ ఇయర్ పాలనపై విజయోత్సవాలకు గ్రాండ్‌గా ప్లాన్ చేస్తోంది రేవంత్ సర్కార్. ఇంతవరకు బాగానే ఉన్నా పబ్లిక్ పల్స్ మాత్రం ప్రభుత్వానికి పాజిటివ్‌గా లేవట. హామీలు అమలు చేయలేదన్న భావన ప్రజల్లో ఉందని కాంగ్రెస్ భావిస్తోందట. అందుకే ఏడాది ఉత్సవాల కంటే ముందే ఏదో పెద్ద పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ప్లాన్ చేస్తుందట.
ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో సెలబ్రేషన్స్‌కు ప్రభుత్వం రెడీ అవుతోంది. 26 రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారు. డిసెంబర్ 9న హైదరాబాద్‌లో జరిగే ప్రజా విజయోత్సవ ముగింపు సభను భారీస్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహూల్, ప్రియాంకను ఇన్వైట్ చేయాలని భావిస్తున్నారు. ఉత్సవాలు వ్యూహ రచన బానే ఉన్నా..ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టెన్షన్ పెడుతున్నాయట.
ఆరు గ్యారెంటీలు..ఎన్నో హామీలు ఇచ్చి పవర్‌లోకి వచ్చింది కాంగ్రెస్. ఆరు గ్యారెంటీల్లో రుణమాఫీ కోసం ఓ అడుగు ముందుకు వేశారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని..మరో 13 వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంటే పూర్తిస్థాయి రుణమాఫీ చేయలేదని ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు స్పష్టం అవుతుంది.
మరో హామీని అమలు చేసి..
మహిళలకు ఆర్టీసీ బస్సు ఫ్రీగా ఇంప్లిమెంట్ అవుతోంది. 2వందల యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ స్కీమ్ అమలులో ఉంది. అయినా ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు భావిస్తున్నారట కాంగ్రెస్ నేతలు. అందుకే ఆరు గ్యారెంటీల్లోని ప్రధానమైన మరో హామీని అమలు చేసి ప్రజా విజయోత్సవాలకు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది
మరో కీలక పథకాన్ని అమలు చేయడం ద్వారా..అపోజిషన్‌ను డైలమాలో పడేయొచ్చని ప్లాన్ చేస్తున్నారట సీఎం రేవంత్. రైతు భరోసా స్కీమ్‌ను ఇంప్లిమెంట్ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు విడతల్లో 10వేల రూపాయలను రైతుబంధు కింద ఇచ్చింది. కాంగ్రెస్ రైతు భరోసాగా హామీ ఇచ్చి..అధికారంలోకి వస్తే 15వేలు ఇస్తామని చెప్పింది.
కానీ ఏడాది అవుతున్నా ఇవ్వడం లేదని విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. రైతులు కూడా వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. దీంతో ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఎలాగైనా రైతు భరోసా హామీని నెరవేర్చాలని భావిస్తోందట రేవంత్ సర్కార్. రైతు భరోసా కోసం నిధుల సర్దుబాటు చేయాలని ఆర్థికశాఖను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారట.
కఠినమైన గైడ్‌లైన్స్
రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమైన కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన గైడ్‌లైన్స్ రూపొందిస్తోందని అధికారిక వర్గాల సమాచారం. ఇప్పటికే క్యాబినెట్ సబ్‌కమిటీలోనూ రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని చూస్తోంది రేవంత్ సర్కార్. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజాభిప్రాయ సేకరణలో చాలా సలహాలు, సూచనలు వచ్చాయి.
ఏడు నుంచి ఎనిమిది ఎకరాల వరకు లిమిట్ పెట్టి రైతు భరోసా ఇచ్చేలా ప్లాన్ చేస్తోందట ప్రభుత్వం. తెలంగాణలో కోటీ 39లక్షల ఎకరాలు సాగులో ఉందట. ఈ లెక్కన దాదాపు 9 నుంచి 10 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆర్ధిక శాఖ రైతు భరోసాకు కావాల్సిన నిధులను జమచేసే పనిలో సీరియస్‌గా ముందుకెళ్తోందని తెలుస్తోంది. డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 9 వరకు రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమచేసి రైతులను సంతృప్తి పరచడంతో పాటు ప్రతిపక్షాల ఆందోళనలకు చెక్ పెట్టాలని డిసైడ్ అయ్యిందట రేవంత్ సర్కార్.
రైతు భరోసాతో పాటు మహిళలకు నెలకు 2వేల 5వందల ఇచ్చే స్కీమ్ మీద కూడా రేవంత్ సర్కార్ ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రైతు రోసా నిధులను జమ చేసి..మహిళలకు నెలకు 2వేల 5వందల ఇచ్చే స్కీమ్ గైడ్‌లైన్స్ రిలీజ్ చేస్తారట. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారు అవుతున్నట్లు తెలుస్తోంది. నెలకు 2వేల 5వందల సాయం పొందేందుకు డిసెంబర్ 9 నుంచి మహిళల దరఖాస్తులు కూడా స్వీకరించే యోచనలో ఉన్నారట. ఇలా రెండు ప్రధాన హామీలను అమలు చేసి..ప్రజావ్యతిరేకతను చల్లబర్చడంతో పాటు..అపోజిషన్‌కు బ్రేకులే వేసే ప్లాన్‌లో ఉన్నారట సీఎం రేవంత్.
జగన్‌ను వదలని పవన్ కల్యాణ్.. అధికారులనే బెదిరిస్తారా అంటూ పవన్ వార్నింగ్