జగన్‌ను వదలని పవన్ కల్యాణ్.. అధికారులనే బెదిరిస్తారా అంటూ పవన్ వార్నింగ్

లేటెస్ట్‌ ఇష్యూ వరకు పవన్‌ కామెంట్స్, అపోజిషన్‌ రియాక్షన్‌ ఎలా ఉన్నా..జగన్‌ను టార్గెట్‌ చేయడంలో మాత్రం చంద్రబాబు కంటే ఓ అడుగు ముందే ఉంటున్నారు పవన్.

జగన్‌ను వదలని పవన్ కల్యాణ్.. అధికారులనే బెదిరిస్తారా అంటూ పవన్ వార్నింగ్

Pawan Kalyan question Jagan

Updated On : November 12, 2024 / 7:28 AM IST

ఒకరు తండ్రి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన నేత. మరొకరు సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన లీడర్. ఇద్దరి విధానాలు వేరు. ఆలోచనలు వేరు. వాళ్ల ఫ్యాన్‌ బేస్‌ కూడా వేరు. ఆ ఇద్దరే వైసీపీ అధినేత జగన్..జనసేన అధినేత పవన్. ఈ ఇద్దరికి వైరం ఎక్కడ మొదలైందో తెలియదు. కానీ ఒకరంటే ఒకరికి అసలు గిట్టదు. పవన్‌ అయితే తన పొలిటికల్‌ ఎంట్రీ నుంచి జగన్‌ టార్గెట్‌గానే పావులు కదుపుతూ వస్తున్నారు. జగన్‌ పేరు ఎత్తితే చాలు ఒంటికాలుపై లేస్తారు పవన్. అప్పుడు అపోజిషన్‌లో అయినా.. ఇప్పుడు పవర్‌లో ఉన్నప్పటికీ పవన్‌..జగన్‌నే టార్గెట్‌ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు జనసేన అధినేతగా పవన్‌ అప్పటి ప్రభుత్వ విధానాలను గట్టిగా ప్రశ్నించారు. అందులోనూ జగన్‌ తీరు మీదే ఆయన ఎక్కువగా మాట్లాడేవారు. ఏకంగా జగన్‌ను రాజకీయంగా అధఃపాతాళానికి తొక్కుతానంటూ శపథం చేసిన పవన్.. మొన్నటి ఎన్నికల్లో అనుకున్నంత పనిచేశారు.

సుమోటో కేసులు పెడతామంటూ జగన్‌కు వార్నింగ్
అధికారంలోకి రావాలనే దాని కంటే జగన్‌ను ఓడించాలనే దానిపైనే ఒకటి కాదు పది మెట్లు దిగి పొత్తు సెట్‌ చేసి ఎన్నికల్లోకి వెళ్ళారు. ఓట్లు చీలితే జగన్‌ గెలుస్తారా..ఆ తప్పు జరగనివ్వనంటూ చెప్పిన పవన్..తాను తగ్గినా జగన్‌ను ఓడించడంలో మాత్రం పైచేయి సాధించారు. ఇప్పుడు కూడా జగన్‌ టార్గెట్‌గానే పవన్ రాజకీయం కొనసాగుతోంది.

రాజకీయంగా చంద్రబాబు, జగన్‌కు ఎప్పటి నుంచో వైరం ఉంది. కానీ చంద్రబాబు కంటే పవనే..జగన్‌ను ఎక్కువగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. వైసీపీ శ్రేణులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటూ ప్రస్తావించిన జగన్.. అధికారులకు వార్నింగ్‌ ఇచ్చేలా మాట్లాడటంపై గరగరం అయ్యారు పవన్. జగన్‌ కామెంట్స్ మీద ఓ రేంజ్‌లో రియాక్ట్‌ అయ్యారు.

IAS అధికారులను బెదిరించే వారిపై సుమోటో కేసులు పెడతామంటూ జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ అధినేత జగన్ బాధ్యత లేకుండా తిరుపతి ఎస్పీ, ఏపీ డీజీపీపై బెదిరింపు ధోరణితో మాట్లాడారన్న పవన్..బెదిరిస్తే బెదిరిపోమన్నారు. తమది మంచి ప్రభుత్వమే కానీ..మెతక ప్రభుత్వం కాదని..అధికారులపై చిన్న గీటు పడినా చూస్తూ ఊరుకోమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. IAS అధికారులకు వార్నింగ్ ఇస్తే సుమోటో కేసులు పెడతామన్నారు.

చంద్రబాబు కంటే ఓ అడుగు ముందే..
లేటెస్ట్‌ ఇష్యూ వరకు పవన్‌ కామెంట్స్, అపోజిషన్‌ రియాక్షన్‌ ఎలా ఉన్నా..జగన్‌ను టార్గెట్‌ చేయడంలో మాత్రం చంద్రబాబు కంటే ఓ అడుగు ముందే ఉంటున్నారు పవన్. సరస్వతి ఇండస్ట్రీస్ భూముల ఇష్యూపై కూడా పవన్‌ అధికారులతో సర్వే చేయించారు. వైసీపీ సోషల్ మీడియా పోస్టుల విషయంలోనూ ఓపెన్‌గానే స్టేట్‌మెంట్‌ ఇచ్చి జగన్‌ను కార్నర్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా సందర్భం ఏదైనా..జగన్‌విషయంలో ఒంటికాలిపై లేస్తున్నారు పవన్.

మాటి మాటికి పవన్..జగన్‌ను టార్గెట్‌ చేయడమేంటన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందు నుంచే జగన్‌ విధానాలు..అతని తీరు అంటే పవన్‌కు నచ్చదట. ఇక ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ కూడా పవన్‌ జగన్‌ను టార్గెట్‌ చేయడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు. వైసీపీ ఓటు బ్యాంక్‌ను ఎంత తగ్గిస్తే అంతలా అది జనసేనకు కలసి వస్తుందనే స్కెచ్‌తో ఉన్నారట.

వైసీపీ ఓటర్లు టీడీపీకి యాంటీగా ఉంటారు కాబట్టి వాళ్లు పార్టీ మారాలనుకున్నా ఆ సైడ్ వెళ్లడానికి ఆసక్తి చూపించరు. మూడో పార్టీగా ఉన్న జనసేనవైపు అయితే వెళ్ళేందుకు మొగ్గు చూపొచ్చన్న అంచనా ఉంది. అందుకే జగన్‌ను టార్గెట్‌ చేయడం ద్వారా వైసీపీని వీక్‌ చేసి..తన పార్టీ బలం పెంచుకునే ప్లాన్‌లో పవన్‌ ఉన్నారట. అప్పుడు తానే వైసీపీకి, జగన్‌కు అసలైన ప్రత్యర్థిగా ఉండాలనేది పవన్‌ ఆలోచనగా చెబుతున్నారు పొలిటికల్ ఎనలిస్టులు.

Minister Savitha: ఇదేమైనా జబర్దస్త్ ప్రోగ్రామా రోజా?: ఏపీ మంత్రి సవిత