Minister Savitha: ఇదేమైనా జబర్దస్త్ ప్రోగ్రామా రోజా?: ఏపీ మంత్రి సవిత
ఎంతమందైనా కోచింగ్ యాప్ ద్వారా శిక్షణ తీసుకోవచ్చని మంత్రి సవిత తెలిపారు.

AP Minister Savitha
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌లో బీసీలకు రూ.39 వేల కోట్లు కేటాయించిందుకు బీసీల తరుపున సీఎం చంద్రబాబుకు ధన్యవాదములు తెలుపుతున్నామని మంత్రి సవిత అన్నారు. ఇవాళ అమరావతిలో ఆమె మాట్లాడారు. 16వ తారీఖు నుంచి బీసీ స్టడీ సర్కిల్‌లో డీఎస్సీకి కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించారని చెప్పారు. 2,720 మందికి కోచింగ్ ఇస్తామని, యాప్ ద్వారా కూడా శిక్షణ ఇస్తామని అన్నారు.
ఎంతమందైనా కోచింగ్ యాప్ ద్వారా శిక్షణ తీసుకోవచ్చని మంత్రి సవిత తెలిపారు. మాజీ మంత్రి రోజా బడ్జెట్ మీద మాట్లాడటానికి ఇదేమైనా జబర్దస్త్ ప్రోగ్రామా అని నిలదీశారు. సూపర్ సిక్స్‌ను తాము తప్పకుడా అమలు చేస్తామని అన్నారు. జగన్ వస్తే జాబ్ వస్తుందని చెప్పారని, వచ్చాయా అని నిలదీశారు. రోజా చర్చకు వస్తే చర్చించడానికి ఏ సర్కిల్లో అయినా సిద్ధమని ప్రకటించారు.
గౌరవ సభను కౌరవ సభగా మార్చారని, తాము కుటుంబ సభ్యులు అందరూ కలిసి కుర్చొని చూసేవిధంగా అసెంబ్లీ నిర్వహిస్తామని మంత్రి సవిత చెప్పారు. పులివెందులలో కనీస వసతులు లేవని, జగన్ వచ్చి పులివెందుల సమస్యలు మాట్లాడవచ్చు కదా? అని అన్నారు. పులివెందులలోని అన్ని సమస్యలు తీరుస్తామని చెప్పారు.
Russia: ‘ట్రంప్, పుతిన్ ఫోనులో మాట్లాడుకోలేదు’ అంటూ అమెరికా మీడియాపై మండిపడ్డ రష్యా