TPCC : 27మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు.. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం..

టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

TPCC : 27మంది వైస్ ప్రెసిడెంట్లు, 69 మంది జనరల్ సెక్రటరీలు.. టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం..

Gandhi Bhavan

Updated On : June 10, 2025 / 12:26 AM IST

TPCC : టీపీసీసీ కార్యవర్గాన్ని ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. గతంలోనే 5 కమిటీలను నియమించిన హైకమాండ్ తాజాగా మరో రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. 27 మందికి వైస్ ప్రెసిడెంట్ లుగా(ఉపాధ్యక్షులు) అవకాశం కల్పించింది. 69 మందిని జనరల్ సెక్రటరీలుగా (ప్రధాన కార్యదర్శులు) నియమించింది. అయితే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లను మాత్రం ప్రకటించలేదు. ఈ నియామకం ఇంకా కొలిక్కి రాలేదు.

టీపీసీసీకి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి పదవుల నియామకంలో సామాజిక న్యాయం పాటించడంతో పాటు మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలలో 8మందికి ఛాన్స్ దక్కింది. ఇక ఐదుగురు ఎస్సీలు, ఇద్దరు ఎస్టీలతో పాటు మరో ముగ్గురు మైనార్టీలకు వైస్ ప్రెసిడెంట్ పదవులు దక్కాయి. 67శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు దక్కాయి.

ఇక 69 మంది ప్రధాన కార్యదర్శి పదవుల్లోనూ బీసీలలో 26మందికి దక్కింది. ఎస్సీలలో 9మందికి, ఎస్టీలలో నలుగురికి, మైనార్టీలలో 8మందికి ప్రధాన కార్యదర్శి పదవులు దక్కాయి.

* పలువురు ఎమ్మెల్యేలకు పార్టీ పదవులు ఇచ్చిన ఏఐసీసీ
* వైస్ ప్రెసిడెంట్లుగా ఎంపీ రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, చిక్కుడు వంశీ కృష్ణ
* వైస్ ప్రెసిడెంట్లుగా ఎమ్మెల్సీలు బల్మూర్ వెంకట్, బస్వరాజు సారయ్య
* జనరల్ సెక్రటరీలుగా వెడ్మ బొజ్జూ, పర్నిక రెడ్డి, మట్ట రాగమయి.