Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్.. చర్యలకు రంగం సిద్ధం!
Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల నియోజకవర్గంకు చెందిన జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది.
Jeevan Reddy
Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్ నేత, జగిత్యాల నియోజకవర్గంకు చెందిన జీవన్ రెడ్డిపై హైకమాండ్ సీరియస్ అయింది. ఆయనపై చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ రెబల్స్ తరపున ఆయన ప్రచారం నిర్వహించడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిపిన అభ్యర్థులను కాదని.. రెబల్స్ కు మద్దతుగా ప్రచారం నిర్వహించడంపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఇది పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కిందకు వస్తుందని హైకమాండ్ భావిస్తోంది.. ఈ క్రమంలో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది.
మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సంజయ్ అనుచరులకు బీఫామ్స్ ఇచ్చారని జీవన్ రెడ్డి గతంలోనే ఆరోపణలు చేశారు. తన అనుచరులకు బీఫామ్ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు.. మరో అడుగు ముందుకేసి తన అనుచరులను బరిలో నిలిపిన జీవన్ రెడ్డి.. వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇటు జీవన్ రెడ్డి, అటు సంజయ్ మధ్య నెలకొన్న వర్గపోరుతో కాంగ్రెస్ పార్టీకి, అభ్యర్థులకు నష్టం కలుగుతుందని హైకమాండ్ భావిస్తోంది.
