Hanumantha Rao: హైదరాబాద్ నగర శివారులో కాంగ్రెస్ బీసీ గర్జన సభ.. రేవంత్‌కు భద్రత తొలగించడంపై ఆగ్రహం
సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం.

Hanumantha Rao
Former PCC President Hanumantha Rao: బీసీ వర్గాలకు అండగా నిలిచేది కాంగ్రెస్ పార్టీనేఅని, బీసీలందరిని ఏకంచేసేందుకు త్వరలో బీసీ గర్జన సభను నిర్వహిస్తామని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ వి. హన్మంతరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇద్దరు కుల గణన చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. రెండుసార్లు ప్రధాని మోదీని కలిసినా ప్రయోజనం లేదని వీహెచ్ విమర్శించారు. తెలంగాణలో 54శాతం బీసీలు ఉన్నాం. ప్రత్యేక మంత్రిత్వ శాఖను కేటాయించాలని కోరాం.. కానీ, కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Malkajgiri: మల్కాజ్‌గిరి సీటుపై బీజేపీ కీలక నేతల ఫోకస్.. టిక్కెట్ రేసులో ఆ నలుగురు!
బీసీ గర్జన నిర్వహణకోసం బీసీలను చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ హామీని క్షేత్ర స్థాయికి తీసుకెళ్ళానని, ఉమ్మడి పది జిల్లాల్లో నేను పర్యటించానని, బీసీల నుంచి మంచి స్పందన వచ్చిందని హన్మంతరావు చెప్పారు. శుక్రవారం పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీలను కలిశాను, సెప్టెంబర్ 6వ తేదీ తర్వాత బీసీ గర్జన సభ పెట్టేందుకు సమయం తీసుకోవాలని సూచించడం జరిగిందని, ఈ సభకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్యఅతిధిగా వస్తారని వీహెచ్ చెప్పారు. కాంగ్రెస్ బీసీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తుండటంతో అదిచూసి మిగిలిన పార్టీలుకూడా బీసీల వైపు మొగ్గు చూపుతున్నాయని అన్నారు.
సూర్యాపేటలో బీసీల గర్జన సభకు స్థానికులు అడ్డు చెప్పారు. అందువల్ల హైదరాబాద్ నగర శివారులో సభ పెట్టాలని భావిస్తున్నాం. కనీసం రెండు లక్షల మందితో సభ పెడతామని హన్మంతరావు అన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డికి గన్‌మెన్లను తొలిగించడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ పార్టీ నాయకుడికి భద్రత లేకుండా చెయ్యడంలో ఆంతర్యం ఏమిటని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్రమంతా తిరిగే మా పీసీసీకి ఏదైనా జరిగితే బాధ్యత ఎవ్వరిదని వీహెచ్ అన్నారు. తక్షణమే నాకు, మా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి భద్రత కల్పించాలని హన్మంతరావు డిమాండ్ చేశారు.