డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు

నేను లోకల్ కాదు అంటున్నారు.. మరి, రేణుకాచౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా? అంటూ వీహెచ్ ప్రశ్నించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై వీహెచ్ సంచలన ఆరోపణలు

Congress Leader V. Hanmantha Rao

Updated On : March 10, 2024 / 12:21 PM IST

Congress Leader Hanmantha Rao : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి. హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం వీహెచ్ మీడియాతో మాట్లాడుతూ.. ఖమ్మం లోక్ సభ సీటు తనకు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. భట్టి విక్రమార్క నాకు ద్రోహం చేస్తున్నారని, భట్టి ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారో నాకు తెలియడం లేదని వీహెచ్ అన్నారు. మొదట ఖమ్మం పార్లమెంట్ స్థానం నాకే ఇస్తా అన్నారు.. ఇప్పుడు నన్ను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నా కుటుంబంలో ఎవరు రాజకీయాల్లో లేరు.. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాకు న్యాయం చేయాలని అన్నారు.

Also Read : Telangana BJP : త్వరలో బీజేపీ రెండో జాబితా.. ఎనిమిది నియోజకవర్గాలకు అభ్యర్థులు వీరే?

భట్టి విక్రమార్క ఈరోజు పార్టీలో ఈ స్థానంలో ఉన్నాడంటే అందుకు నేనే కారణం. నేను లోకల్ కాదు అంటున్నారు. మరి రేణుకాచౌదరి, నాదెండ్ల భాస్కర్, రంగయ్య నాయుడు లోకలా? పార్టీకోసం, పదవులు ఆశించకుండా పనిచేసిన తనకు న్యాయం చేయాలని అన్నారు. ఖమ్మం లోక్ సభ స్థానం నాకు కేటాయిస్తే ఖచ్చితంగా గెలుస్తానని దీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, బీసీ ఓట్లు కాంగ్రెస్ కు అవసరం లేదా? బీసీలు ఓట్లువేసే మిషన్లా అంటూ వీహెచ్ ప్రశ్నించారు.

Also Read : BRS : వారసుల వెనకడుగు..! బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా మారిన సీన్, కారణం అదేనా?

నేను పార్టీకోసం పనిచేశా.. చచ్చే వరకు పార్టీలో ఉంటా.. చనిపోయిన తరువాత పార్టీ జెండానాపై ఉంటుందని అన్నారు. నేను పార్టీలో ఎందరికో సహాయం చేశా.. నా వయస్సు నాకు అడ్డంకి కాదు. ఈ వయస్సులోనూ రన్నింగ్ రేసులో పాల్గొంటా అంటూ వీహెచ్ అన్నారు. రాహుల్ గాంధీ ఖమ్మం నుంచి పోటీచేస్తే నేను తప్పుకుంటా.. రాహుల్ గాంధీ ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేయకుంటే నేనే అర్హుడిని అంటూ వీహెచ్ పేర్కొన్నారు.